‘క్లాస్’ సినిమాలే అయినా ‘మాస్’కీ నచ్చే అంశాలూ ఉన్నాయి

175

ఈ వారం ‘సమ్మోహనం, నా నువ్వే’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పేర్లు తగ్గట్లు రెండు కూడా క్లాస్ సినిమాలే. అలాగే రెండు కూడా ప్రేమకధలే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాల ట్రైలర్స్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.  ‘సమ్మోహనం’ చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించగా ‘నా నువ్వే’ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహించారు.

‘సమ్మోహనం’ సినిమా విషయానికి వస్తే సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కలయికలో వస్తున్న తొలి సినిమా. తెలుగమ్మాయే అయినా బాలీవుడ్ నుండి సినీ ప్రయాణం మొదలు పెట్టిన అదితిరావు ఈ సినిమాలో నాయికగా నటిస్తోంది. క్లాస్ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి ఈ సినిమాను సినిమా ఇండస్ట్రీ నేపధ్యంలో సాగే కధతోనే తెరకెక్కించాడు. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి కమర్షియల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది.

‘నా నువ్వే’ పక్కా క్లాస్ సినిమా. చిత్ర దర్శకుడు జయేంద్ర చివరిగా తీసిన ‘180’ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో మాస్ హీరో కళ్యాణ్ రామ్ ను తొలిసారి క్లాస్ పాత్రలో చూపిస్తున్నారు. ట్రైలర్లు, టీజర్లు చూస్తుంటే పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. తమన్నా ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్. పీసీ శ్రీరామ్ త కెమేరాతో ల=మ్యాజిక్ చేసారని ప్రోమోలు చూస్తుంటేనే తెలుస్తోంది.

ప్రస్తుతం థియేటర్ లో వున్న రజనీకాంత్ ‘కాలా’ ఫ్లాప్ అని తేలిపోవటంతో ప్రేక్షకులు మరో సినిమా కోసం చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వస్తున్న ఈ రెండు క్లాస్ సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.