క్వాంటం కంప్యూటర్: ఈ టెక్నాలజీలో అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలతో ఇండియా ఎందుకు పోటీ పడుతోంది? – telugupunch.com

రాబోయే కాలంలో, క్వాంటం కంప్యూటింగ్ ప్రపంచాన్ని మార్చేయగల టెక్నాలజీగా మారబోతోంది. దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దీని డెవలప్‌మెంట్ కోసం బడ్జెట్‌లో రూ. 8 వేల కోట్లు కేటాయించింది.

ఈ ఏడాది ఆగస్టు చివరన క్వాంటం సిమ్యులేటర్ QSim ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దీనివల్ల శాస్త్రవేత్తలు, సంస్థలు ఈ రంగంలో పరిశోధన చేయడం సులువవుతుంది. భవిష్యత్తుకు కొత్తగా దిశానిర్దేశం చేసే ఈ టెక్నాలజీ విషయంలో భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం 2018లో నేషనల్ క్వాంటం ఇనిషియేటివ్ యాక్ట్‌ని రూపొందించింది. దీనికోసం $1.2 బిలియన్లు ( సుమారు రూ.9000 కోట్లు ) కేటాయించింది.

2016లో ప్రకటించిన 13వ పంచవర్ష ప్రణాళికలో క్వాంటమ్ కమ్యూనికేషన్స్‌ను కీలకమైన పరిశ్రమగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ పేర్కొంది. బ్రిటన్ కూడా 2013లో క్వాంటమ్ టెక్నాలజీలో జాతీయ వ్యూహాన్ని ప్రకటించగా, 2016లో కెనడా ఈ టెక్నాలజీలో 50 మిలియన్ కెనడియన్ డాలర్ల ( సుమారు రూ.293 కోట్లు ) పెట్టుబడిని ప్రకటించింది. జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, రష్యా, జపాన్ వంటి దేశాలతో పాటు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా ఈ టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నాయి.

దీంతో క్వాంటం టెక్నాలజీ అంటే ఏంటి, దాని కోసం దేశాలు సంస్థలు ఎందకు పోటీ పడుతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. క్వాంటం కంప్యూటింగ్‌ని అంటే ఇప్పుడున్న కంప్యూటర్ టెక్నాలజీని అత్యంత వేగవంతమైన టెక్నాలజీగా మార్చడం. సింపుల్‌గా చెప్పాలంటే, సాధారణ కంప్యూటర్ గుర్రపు బండి లాంటిదైతే, క్వాంటం కంప్యూటింగ్ రేస్‌ కార్ లాంటింది. కొత్త మెటీరియల్స్‌ సృష్టి, మెడిసిన్ తయారీ, కృత్రిమ మేధస్సు లాంటి అంశాలను మెరుగుపరచడంలో క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు.

Similar Articles

Comments

తాజా వార్తల