నాని ‘జెర్సీ’లో విషయముంది

393

నటుడు నాని తొలిసారి బ్యాటు ప‌ట్టాడు. గ్రౌండ్‌లో దిగి సిక్స‌ర్లూ, ఫోర్లూ బాదాడు. ‘జెర్సీ’ సినిమాలో నాని క్రికెట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ‘మళ్ళీరావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సంక్రాంతి సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌లైంది.

‘నీ వయసు 36 ఏళ్ళు. అది ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ నుంచి రిటైరయ్యే ఏజ్‌. పిల్లల్ని ఆడించే వయసులో మనకు ఆటలెందుకు బావ?.. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు’ అంటూ టీజర్ మొదలైంది. ఎండింగ్‌లో  ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’ అనే డైలాగ్‌ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆమె సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెబుతున్నారు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.

నాని సినిమా అంటే వినోదం ఆశిస్తాం. ఈసారి మాత్రం నాని ఎమోష‌న్‌ని న‌మ్ముకున్నాడ‌నిపిస్తుంది. స్పోర్ట్స్ నేప‌థ్యంలో సాగే సినిమాలు బాలీవుడ్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. తొలిసారి పూర్తి క్రీడా నేప‌థ్యంలో సినిమా రావ‌డం అందులో నాని న‌టించ‌డం విశేష‌మే.