అక్కినేని మూడో తరానికి టైమొచ్చింది.!

170

భారత సినీ పరిశ్రమలోనే లెజెండ్ కీ.శే. అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఆయన మూడో తరం నటులు రాణిస్తున్నారు. ఆయన కొడుకులు, కూతుర్ల పిల్లలు పరిశ్రమలో నటనతో పాటు ఇతర విభాగాల్లో నిలదొక్కుకున్నారు. వీరిలో ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సుప్రియ, సుశాంత్ లకి ఒకేసారి సక్సెస్ వచ్చింది.

సుప్రియ 22 ఏళ్ళ కిందట పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో హీరోయిన్ గా ఆరంగేట్రం చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అవడమే కాకుండా హీరోయిన్ పాత్రలకు నప్పదని విమర్శలు రావడంతో ఆ తర్వాత నటనకు దూరమై ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది. రెండు దశాబ్దాల తర్వాత అడివి శేష్ నటించిన ‘గూఢచారి’తో రీ-ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు మంచి టాక్ రావడమే కాకుండా సుప్రియ నటనకు పేరొచ్చింది.

సుశాంత్ 2008లో ‘కాళిదాసు’ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా లాంటి పలు సినిమాల్లో నటించినా మెప్పించలేకపోయాడు. ఎట్టకేలకు  శుక్రవారం విడుదలైన ‘చి.ల.సౌ’ సినిమాతో హిట్ సొంతం చేసుకున్నాడు. మరీ అద్భుతమైన విజయం కాకపోయినా సుశాంత్ నటనకు ప్రేక్షకుల మార్కులు బాగానే పడ్డాయి.

మరోవైపు యావరేజ్ కెరీర్ తో సాగుతున్న సుమంత్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించబోతున్నట్టు అధికారికంగా కన్ఫర్మ్ చేసాడు. సుమంత్ రెండు దశాబ్దాల క్రిందట ‘ప్రేమకధ’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చినప్పటికీ మధ్య మధ్యలో గోదావరి, గోల్కొండ్ హైస్కూల్ లాంటి హిట్ సినిమాలు వచ్చినా నిలదొక్కుకోలేకపోయాడు. ఎన్టీఆర్ బయోపిక్ కెరీర్ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.