రివ్యూ : సూర్య ‘సైనికుడి’గా ఓకే

221

టాలీవుడ్ లో ఉన్న కొద్దిమంది రచయితల్లో ప్రతిభ నిరూపించుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రచయితగా సక్సెస్ అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడో, లేదో ఇప్పుడు చూద్దాం.

కథేమంటే ..

సూర్య (అల్లు అర్జున్)కి కోపం ఎక్కువ. కోపం, ఆవేశం, చిరాకు కలిసిన కొత్త గుణం కలిగిన సూర్య చిన్నప్పుడే తండ్రిని వదిలి వచ్చేసి, గాడ్ ఫాదర్ లా భావించే (రావు రమేష్) సాయంతో పెరుగుతాడు. ఆర్మీ ప్రధాన కార్యాలయం నుండి బోర్డర్ లు వెళ్ళి సిపాయిగా ఉండాలనే గమ్యంతో ఉంటాడు. తనకి ఉన్న అలవికాని కోపంతో ఒక ఉగ్రవాదిని చంపేస్తాడు. మిలటరీ లోంచి బయటకు పంపేస్తారు. కానీ గాడ్ ఫాదర్ సాయంతో పదే పదే కోరడంతో, ప్రఖ్యాత సైకాలజిస్ట్ రామరాజు (అర్జున్) నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోమంటారు. ఆ సైకాలజిస్ట్ సూర్య కన్నతండ్రే అయినా వెళ్ళి ప్రయత్నిస్తాడు. అప్పుడేం జరిగిందన్నది మిగిలిన కథ.

ఎలా ఉందంటే ..

తండ్రి సంతకం కోసం కొడుకు వెళ్ళడం వరకు బాగానే ఉంది. కానీ హీరో ఫ్లాష్ బ్యాక్ ను కాస్త ఆకట్టుకునేలా చెప్పలేకపోయారు. సినిమా రెగ్యులర్ కామన్ ఆడియన్స్ కు నచ్చాలని సాదా సీదా సీన్లు చొప్పించారు. 21 రోజుల పాటు కోపం అణచుకు ఉండాలన్న నియమం పెద్ద గొప్పగా అనిపించదు. సినిమాలో హీరో క్యారెక్టర్ లో వున్న వైవిధ్యం ఇక్కడ కనిపించదు. మొత్తంగా చూసుకుంటే తొలిసగం ఫరవాలేదనే ఫీల్ కలిగించి వదిలిపెడుతుంది. మలిసగం ప్రారంభమయ్యాక, గట్టి సీన్లే పడ్డాయి. నిజానికి సినిమాకు బలమైన సన్నివేశాలు కూడా అవే. ముఖ్యంగా సాయిుకుమార్ కుటుంబం ఎపిసోడ్ లు అన్నీ శభాష్ అనిపించుకుంటాయి. బలమైన సంభాషణలతో కూడిన ఆలోచింప చేసే సన్నివేశాలు, ఆ తరువాత బలమైన ఫైట్ సీన్లు వెంటవెంటనే వచ్చేసరికి ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి కలిగించదు. ఇలా కథనం కిందకి పైకి ఎక్కుతూ, దిగుతూ రావడం స్క్రీన్ ప్లే  సమస్య. పతాక సన్నివేశంలో సంభాషణలు బాగున్నాయి కానీ, విలన్ ఒక్కసారిగా బలహీనమైపోయాడు. ఇలా సినిమా మొత్తం మీద జనాలను కాస్త ఆలోచించి, బాగుందా? బాగోలేదా? ఏవరేజ్ నా? అని ఊగిసలాడేలా చేస్తుంది.

ఎవరెలా..

సూర్య క్యారెక్టర్ ను వక్కంతం ఆరంభం నుంచి చివరి వరకు బాగా తీర్చిదిద్దాడు. దానికి మాంచి సంభాషణలు అందించాడు. బన్నీ దానికి తగినట్లు తనకు తాను మౌల్డ్ అయి మంచి నటన అందించాడు. సీనియర్ అర్జున్ క్యారెక్టర్ సినిమాకు బలం. విలన్ గా శరత్ కుమార్ బాగున్నాడు. హీరోయిన్ అను ఇమాన్యుయేల్ అందంగా ఉంది. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది.  టోటల్ గా వక్కంతం వంశీ సంభాషణల రచయితగా హిట్. దర్శకుడిగా కూడా ఓకె. బన్నీ నటుడిగా వన్ మేన్ ఆర్మీ అయ్యి సినిమాను నడిపించాడు.

ఫైనల్ గా ..

భావోద్వేగాలతో దేశభక్తిని తట్టి లేపే ప్రయత్నం చేసారు.