‘అజ్ఞాతవాసి’ నుండి ఎవరు పాఠం నేర్చుకోవాలి

246
మాస్ ఫాలోయింగ్ వున్న హీరో సినిమా ప్రేక్షకులకు నచ్చేలా తీయడం అంత సులువు కాదు. కొత్తదనంతో పాటు అన్ని వర్గాల పేక్షకులను అలరించాలి. ప్రయోగాలు పేరుతో వారి పరిధి దాటిపోనీకుండా సినిమా మనదే అనుకునేలా తీయాలి. ముఖ్యంగా సినిమాకి సంగీతం ప్రాణం. ఎంత పెద్ద సినిమాకైనా సౌండ్ యాడ్ అయినప్పుడే ప్రాణం పోసుకుంటుంది. అందుకే ఒక సినిమాకి సౌండ్ డిజైన్ చేసుకోవడం కధ రాసుకున్నంత కష్టం. అలాంటి మ్యూజిక్ విషయంలో ప్రయోగాలు పేరుతో ఎవరికీ అర్ధం కాకుండా ఉండకూడదు.
ముఖ్యంగా పెద్ద సినిమాలకు, హీరో ఇమేజ్ ఉన్న సినిమాలకు కొత్తధనం చూపించాలి. కొత్త కొత్త సౌండ్ లు వినిపించాలి. ట్యూన్ కొత్తగా వుండాలి. అదే టైంలో కొందరికే పరిమితమైపోకూడదు. అలా చేస్తే ఫలితం అజ్ఞాతవాసిలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ‘సౌండ్’ పట్టుకోవడంలో సంగీత దర్శకుడు అనిరుద్  ఫెయిలయ్యాడు. అజ్ఞాతవాసిలో మొదటి పాట విన్నప్పుడే ట్యూన్ బాగున్నా పవన్ కళ్యాణ్ కి మరీ ఇంత లేత పాట అన్న ఫీలింగ్ కలిగింది. తర్వాత వచ్చిన పాటలన్నీ విడిగా వింటే బావున్నాయి. సినిమాలో చూస్తే ఇదేంట్రా అనిపించింది. దర్శకుడు త్రివిక్రమ్ దోషం ఏమంటే పవన్ కళ్యాణ్, ఓ ఫారిన్ లొకేషన్ ఉంటే చాలు, ఇంకేం వద్దన్నట్లుగా చిత్రీకరించాడు.
బయటికొచ్చి, గాలి వాలుగా , ఏబీ పాటలన్నీ సినిమాకి సంబంధం లేనట్టుగా సాగాయి. ఏవో ఆల్బమ్ పాటలు పవన్ కళ్యాణ్ పై షూట్ చేసారనే ఫీలింగ్ తప్ప ‘అజ్ఞాతవాసి’ పాటలని ఎక్కడా అనిపించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సహజంగా పవన్ సినిమాల్లో ఆయన తెరపై కదిలే ప్రతి కదలికకు ఒక పర్టికులర్ రిధమ్ వినిపిస్తుంటుంది. అనిరుద్ మంచి మ్యూజిక్ చేసాడు. సితార్, వయోలిన్, గిటార్ ఇంకొన్ని స్ట్రింగ్ ఎలిమెంట్స్ తో ఒక కొత్త సౌండ్ వినిపించాడు. సింథసైజర్స్ కాకుండా లైవ్ సౌండ్ రికార్డ్ చేసాడు. ఆ సౌండ్ పవన్ సౌండ్ తో మ్యాచ్ కాలేదు.
ఈ తప్పు అనిరుద్ లో కాదు, త్రివిక్రమ్ ఛాయిస్ లోనే వుంది. గత పదేళ్ళుగా తెలుగులో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సినిమాల సంగీత దర్శకుల లిస్టు తీసుకుంటే తమిళనాట క్రేజీ సంగీత దర్శకులుగా ఉన్నవారు ఎవరూ కనిపించరు. పెద్ద హీరో, మాస ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో సినిమా అన్నపుడు వారి లెక్క బట్టీ మాత్రమే మ్యూజిక్ చేయించుకోవాలి.
SHARE