సినిమా రేంజిలో ‘వర్కవుట్ అయ్యింది.?

118

యూట్యూబ్ ఛానళ్ళు పెరిగిన తరువాత తెలుగు వెబ్ సిరీస్ లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. యువ దర్శకులు కొత్త కొత్త అంశాలతో వీటిని రూపొందిస్తున్నారు. ఈ బాటలో ప్రముఖ సినీ నిర్మాత, పత్రికాధినేత, స్టార్ పిఆర్ఓ.బి ఏ రాజు తనయుడు శివకుమార్ దర్శకుడిగా ‘వర్కవుట్ అయ్యింది’ పేరుతో వెబ్ సిరీస్ ప్రారంభించాడు.

‘మా ఆయి’ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ జనవరి5తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పూర్తిగా హైదరాబాద్‌లోని లొకేషన్స్‌లో సినిమా స్థాయిలో షూటింగ్ జరిగిందని సమాచారం. దర్శకుడు శివకుమార్ మాట్లాడుతూ ‘దర్శకులు పూరి జగన్నాథ్, వినాయక్ ల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసాను. ఆ అనుభవంతో వెబ్ సిరీస్ తో దర్శకుడిగా తొలి ప్రయత్నం చేసాను. అమెజాన్ ప్రైమ్ లో, నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ కి మంచి రేటింగ్ ఉంది. యూట్యూబ్ లో కూడా వెబ్ సిరీస్ లకు వ్యూయర్ షిప్ మిలియన్స్ లో ఉంటుంది. సీరియల్ లా కాకుండా సినిమా రేంజ్ లో తీయగలిగితే యంగ్ జనరేషన్ తప్పక చూస్తారు. ‘వర్కౌట్ అయ్యింది’లో థ్రిల్లింగ్, యూత్ ఫన్నీ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి’ అన్నాడు.

ఈ వెబ్ సిరీస్‌లో రూపేష్‌కుమార్ చౌదరి, మీనాకుమారి, చక్కని, రాంబాబు వర్మ, శశిధర్, సూర్య, ఫన్ బకెట్ ఫణి, ఫన్ బకెట్ భార్గవి, ఇషాని, ఫణీంద్ర, మోడబుల్ గై, రాహుల్ కొసరాజు తదితరులు నటిస్తున్నారు.