వ్యవస్థలపై నమ్మకం లేదంటూ ఇక్కడి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు.?

276

ఆంధ‌ప్ర‌దేశ్ పోలీసుల‌పై న‌మ్మ‌కం లేదంటూ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల తాజాగా సోష‌ల్ మీడియాలో త‌న‌పై జరుగుతున్న విష ప్రచారంపై హైద‌రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రా పోలీసుల‌పై న‌మ్మ‌కం లేద‌ని వ్యాఖ్యానించటంపై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు స్పందించారు.

ఈ రాష్ట్ర పోలీసుల‌పై న‌మ్మకం లేద‌ని అంటున్న‌వారు ఈ రాష్ట్ర పౌరులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ఇండియాలో ఉండేవారు ఈ దేశంపై న‌మ్మ‌కం లేదు, వేరే దేశంలో ద‌ర్యాప్తు చేయ‌మ‌ని వెళ్తే ఎలా ఉంటుందన్నారు. క‌ష్టం ఉన్న‌ప్పుడు చెప్పుకోవాల‌నీ, అంతేగానీ పోలీసు వ్య‌వ‌స్థ‌పైనే న‌మ్మ‌కం లేద‌ని, ఫిర్యాదు చేయ‌నన‌డం బాధ్య‌తా రాహిత్యం కాదా అని ప్ర‌శ్నించారు. ఈ స‌మాజంలో బాధ్య‌తాయుతంగా లేన‌ప్పుడు, ఇక్క‌డి ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీ చేస్తున్న‌ట్టు అని ప్రశ్నించారు.

హైదరాబాద్ లో ఉంటూ, అక్క‌డ కూర్చుని ఆంధ్రా పోలీసుల‌పై నమ్మ‌కం లేదంటే ఏమ‌నాలంటూ ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బెంగ‌ళూరులో ఉండేవారు బెంగ‌ళూరులోనే కంప్ల‌యింట్ ఇస్తార‌నీ, చెన్నైలో ఉన్న‌వారు చెన్నైలో ఇస్తార‌నీ, అలాగే హైద‌రాబాద్ లో ఉన్న‌వారు అక్క‌డేదైనా జ‌రిగితే అక్క‌డే క‌దా ఫిర్యాదు చేయాల్సిందన్నారు. హైద‌రాబాద్ లో ఉండి ఆంధ్రా పోలీసు వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం లేదంటే ఎలా.? అని ప్ర‌శ్నించారు.

కోడి క‌త్తి దాడి కేసునుద్దేశించి మాట్లాడుతూ సంఘ‌ట‌న విశాఖ‌లో జ‌రిగితే ఫిర్యాదు చేయ‌డం మానేసి, ఇప్పుడు ఎన్‌ఐఎ ద‌ర్యాప్తు కావాలంటున్నార‌న్నారు. కేంద్రం కూడా అత్యుత్సాహంతో స్పందించ‌డం చూస్తున్నామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కి ఎవ‌రైనా వెళ్ళి అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తాం, అమెరికా ప్ర‌భుత్వానికి ఇస్తాం అంటే ఒప్పుకుంటారా అని ప్ర‌శ్నించారు.