ఆగష్టు 13 తెలుగు దేశానికి దుర్థినం అవుతుందా?

1124

ఆగష్టు 13 తెలుగు దేశానికి దుర్థినం అవుతుందా? దేశానికి ఆగస్ట్ సంక్షోభం తప్పదా? ఇది ప్రస్తుతం నెటిజెన్లు ముఖ పుస్తకంలో హాట్ హాట్ గా సాగిస్తున్న చర్చ.

అమ్మో 13…….భాజపాకు 13 వ నంబరంటే డేంజర్ నంబర్.
భాజపా కు మొదటినుండి 13 వ నంబర్ అంటే అచ్చి రాలేదు.

అటల్ బిహారీ వాజ్ పాయి ప్రభుత్వం మొదటి విడత 13 రోజుల్లో మద్దతు కూడగట్టుకోలేక అధికారాన్ని కోల్పోయింది.
రెండవసారి అదే వాజ్ పాయి ప్రభుత్వం 13 నెలలకు జయలలిత దెబ్బకు ఒకే ఒక్క ఓటుతో అధికారాన్ని కోల్పోయింది.
అందుకే భాజపాకు 13 వ నంబర్ అచ్చిరాలేదనే చెప్పాలి.

August Crisis in Telugu Desam Partyఆగష్టు 13 తెలుగు దేశానికి దుర్థినం అవుతుందా?

అయితే కేంద్ర ప్రభుత్వ సర్వేలో బాబుకు 13 వ ర్యాంకును కట్టబెట్టడమంటే మోడీ బాబును డేంజర్ గాడుగా ప్రకటించడమేనంటున్నారు. ఈ డేంజర్ బాబును ఎంత త్వరగా వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నట్టు భోగట్టా.పూర్వం దెయ్యాల సినిమాల పేర్లు కూడా “ఇంటి నం. 13” పేరుతో ఉండేవి.

తెలుగుదేశం పార్టీకి ఆగష్టు నెల అచ్చిరాదు.
రెండు సార్లు ఆగష్టు నెలలో సంక్షోభానికి గురయ్యి నాయకత్వం మార్పు జరిగింది.
అందుకే తెలుగుదేశం పార్టీకి ఆగష్ట్ అంటే భయం.
13 ఆగష్టు 2016 వ తారీఖున TDP కి ఏదో ప్రమాదం ముంచుకొస్తుందేమో అని నెటిజెన్లు డిస్కషన్ షురూ చేశారు..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా 13 నెంబర్ మంచిది కాదని PSLV-C13 రాకెట్ ను ప్రయోగించలేదు. C-13 వదిలిపెట్టి మిగిలినవి C-33 వరకూ ప్రయోగించారు అంటే శాస్త్రవేత్తలకు కూడా 13 అంటే భయం.

AP లో జిల్లాల సంఖ్య 13.
అందుకే జిల్లాల సంఖ్య పెంచాలంటున్నారు.

13 వ నంబర్ అంటేనే అందరూ అదిరిపడుతున్నారు.
వామ్మో13………