ప్రభాస్ 20వ సినిమా మొదలెట్టేసాడు.!

157

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్ తన 20వ చిత్రాన్ని ప్రారంభించాడు. కేకే రాధకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఒకేసారి మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు.

ప్ర‌భాస్-రాధాకృష్ణ సినిమా యూవీ క్రియేష‌న్స్‌లో జ‌ర‌గ‌బోతోంద‌ని ఎప్పుడో డిసైడ్ అయ్యింది. అయితే కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌నీ రంగంలోకి దించారు. ప్ర‌భాస్ మార్కెట్ ‘బాహుబ‌లి’ త‌ర‌వాత‌ ప‌ది రెట్లు పెరిగింది. ప్ర‌భాస్ పారితోషిక‌మే పెట్టుబ‌డిగా పెడుతున్నాడ‌ని లాభాల్లో వాటా అందుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈరోజు హైద‌రాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ముఖ్య అతిధిగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, ప‌లువురు ప్ర‌ముఖులు కూడా పూజా కార్య‌క్రమంలో పాలు పంచుకున్నారు.

సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో తదుపరి చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలోనే ప్రారభించనున్నారు. ఎక్కువ భాగం యూరప్‌లో చిత్రీకరించినున్న ఈ సినిమా పీరియాడిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న ‘సాహో’ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. శ్ర‌ద్ధా క‌పూర్ ఇందులో క‌థానాయిక‌. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.