ఈసారి సంక్రాంతి ‘పవన్-బాలయ్య’ లదేనా.!

379

సినిమా పరిశ్రమకు సంక్రాంతి సీజ‌న్ అంటే పండ‌గే పండ‌గ‌. ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యే ఛాన్స్ అప్పుడే ఉంటుంది. గత రెండు మూడేళ్ళ నుంచీ చిత్ర‌సీమ‌లో ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే క‌నిపించింది. 2018 సంక్రాంతికి ఆ హంగామా మరింత ఎక్కువగా ఉంటుంద‌నుకొన్నారు.

మొన్నటి వరకూ సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్‌, బాల‌య్య‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్ సినిమాలతో పటు త‌మిళం నుంచి రోబో 2.ఓ కూడా దిగిపోతుండ‌డంతో ఈసారి పోటీ మ‌హా రేంజులో ఉంటుంద‌నుకొన్నారు. తాజాగా సంక్రాంతి బ‌రిలోంచి ఒక్కో సినిమా డ్రాప‌వుట్ అవుతూ వ‌చ్చింది. ఇప్పుడు ముగ్గుల పోటీకి రెండే రెండు సినిమాలు మిగిలాయి. షూటింగ్‌లో జాప్యం వ‌ల్ల మ‌హేష్ బాబు త‌న సినిమాని ఏప్రిల్ 27కి వాయిదా వేసాడు. రంగ‌స్థ‌లం కూడా ఈ సంక్రాంతికి విడుద‌ల కావ‌డం లేదు.

బాబాయితో పోటీ దిగ‌డం ఇష్టంలేని చ‌ర‌ణ్‌, కావాల‌నే రంగ‌స్థలం సినిమాని వాయిదా వేసిన‌ట్టు టాక్‌. ఇప్పుడు రజనీ, శంకర్ ల ‘2.0’ కూడా వేసవికి వెళ్ళిపోయింది. అంటే సంక్రాంతి బ‌రిలో మిగిలిన‌వి రెండే రెండు సినిమాల‌న్న‌మాట‌. జ‌న‌వ‌రి 10న ప‌వ‌న్– త్రివిక్రమ్ సినిమా విడుద‌ల అవుతుంది. స‌రిగ్గా పండ‌గ రోజున బాల‌య్య సినిమా బ‌రిలోకి దిగుతుంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఇక ప‌వ‌న్‌, బాల‌య్య‌లు కుమ్మేసుకోవొచ్చు. మ‌ధ్య‌లో చిన్న సినిమాలు రావ‌డానికి ఏమైనా ప్ర‌య‌త్నం చేస్తాయేమో చూడాలి. వ‌చ్చినా బాల‌య్య‌, ప‌వ‌న్ ధాటికి నిల‌దొక్కుకోవాలంటే కంటెంట్ ఉండాలి.