బెల్లంకొండ కెరీర్ కు ‘సాక్ష్యం’గా నిలుస్తుందా.!

166

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. ఈ చిత్రాన్ని పబ్లిసిటీతో కలిపి దాదాపు 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. శాటిలైట్ డిజిటల్ హిందీ రైట్స్ ఒక వంతు పైగా కవర్ చేసేసాయి. విడుదల దగ్గర పడటంతో సినిమా మార్కెటింగ్ షురూ చేసారు. నైజాం జక్కులను రూ.7కోట్లకు పంపిణీ చేయమని దిల్ రాజుకి అప్పగించారు.

ఆంధ్రను రూ.14కోట్ల రేషియోలో మార్కెట్ చేయాలని నిర్ణయించి ఇప్పటికే వైజాగ్ హక్కులను మూడు కోట్లకు ఇచ్చారట. మిగిలిన ఏరియాలు కాస్త అటూ ఇటూగా ఉండటంతో 12 నుంచి 14 మధ్య తెగ్గొట్టేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆంధ్ర-14, నైజాం-7,  సీడెడ్-5 అనుకున్నా, ఇంకా కోటి మిగిలిపోయే అవకాశం ఉండటంతో ఓవర్ సీస్ లో కవర్ చేసుకోవాలని అనుకుంటున్నారట.

బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమా ‘జయజానకీ నాయక’ దాదాపు 45 కోట్ల బిజినెస్ చేసింది. కానీ థియేటర్ కలెక్షన్లు మాత్రం ఆంధ్ర రూ.10 కోట్లు, నైజాం ఆరు కోట్లు, సీడెడ్ నాలుగు కోట్లు వరకూ రాబట్టింది. దీనితో సాక్ష్యం సినిమా కలెక్షన్ మీద భెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ ఆధారపడిఉంది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే శ్రీనివాస్ 40 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా ఫిక్సయిపోతాడు.

పంచభూతాల నేపధ్యంలో ఫాంటసీ కథాంశంతో  తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, అశుతోష్ రానా, రవి కిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.