బోటు ప్రమాదం వెనక నిర్లక్ష్యం ఎవరిది.!

128

ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో జరిగిన విషాద సంఘటన యావత్ ప్రజానీకానికి బాధ కలిగించింది. బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి ఎంతో మంది నాయకులు సానుభూతి ప్రకటనలు చేసారు. ఇంతలో ఈ దుర్ఘటన కాస్త రాజకీయరంగు కూడా పులుముకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ, అధికారుల వైఫల్యమే అని కొందరు విమర్శలు కూడా చేసారు.

అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. దానిలో ప్రమాదం జరిగిన బోటు ఆపరేటర్ ని  అడ్డుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బోటు వెళ్ళడానికి వీల్లేదని అధికారి ఆదేశించినా బోటు నిర్వాహకులు పెడచెవిన పెట్టి గవర్నమెంట్ బోటు సమయం దాటిన తర్వాత పర్యాటకులని ఎక్కించుకుని 21 మందిని మింగేసిన ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది.

ప్రమాదాలెప్పుడూ ఎవరో ఒకరు అడ్డదారి త్రొక్కితేనో, నిర్లక్ష్యం చేస్తేనో జరుగుతాయి. కానీ అలాంటివి జరిగినప్పుడు ఎదుర్కొనడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత సిద్దంగా ఉందనేదే ప్రశ్న. వాస్తవానికి భారత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, డిజాస్టర్ రెస్క్యూ ల్లో వెనుకబడి ఉంది. ఈ సంఘటన వరకు బోటు ఆపరేటర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా, డిజాస్టర్ జరిగిన తర్వాత, స్పందించడం, రెస్క్యూ చేసిన వారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించే విషయంలో మాత్రం ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.