మారుతి బ్రాండ్ వర్కవుట్ అవుతుందా.!

124

దర్శకుడు మారుతి మ‌తిమ‌రుపు క్యారెక్ట‌ర్‌తో ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’ తీసి హిట్ కొట్టాడు. అతి శుభ్ర‌త పాయింటుతో ‘మ‌హానుభావుడు’ పర్లేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘బ్రాండ్ బాబు’ అంటూ మ‌రో కొత్త క‌థతో వస్తున్నాడు. నిర్మాత శైలెంద్రబాబు తన కొడుకు సుమంత్ శైలేంద్రను హీరోగా పరిచయం చేస్తూ కొడుకు భాద్యతను మారుతి చేతుల్లో పెట్టాడు.

మారుతి క‌థ అందించిన ఈ సినిమాకు  బుల్లితెర నటుడు, యాంకర్, దర్శకుడు ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. ఇషా రెబ్బా నాయికగా నటిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ ఈరోజు విడుద‌లైంది. తాగే బాటిల్ నుంచి, పోసే క‌మోడ్ వ‌ర‌కూ అన్నీ బ్రాండ్లే కావాలనుకునే బ్రాండ్ పిచ్చి గ‌ల కుర్రాడు బెంజ్ కారులా ఖ‌రీదైన కోడలుని ఇంటికి తీసుకురావాలనుకుని పేదింటి పిల్ల ప్రేమలో ప‌డిపోతాడు. వారి ప్రేమ‌క‌థ ఎలా సాగిందనే ఈ సినిమా.

టైటిల్‌లో, టీజ‌ర్‌లో కామెడీ క‌నిపిస్తోంది. స‌రిగ్గా తీస్తే మ‌రో మంచి సినిమా అయ్యే ఛాన్సుంది. ఎదుటివాడి ఒంటిమీద బ్రాండ్ కనిపించకపోతే మా వాడి నోటి నుండి మాట కూడా రాదు అనే డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ నవ్వులతో కలర్ ఫుల్ గా ఉంది. మానసిక రుగ్మతల మీద ప్రయోగాలు చేసే ‘మారుతి’ బ్రాండ్ సినిమాకు ప్లస్ అయితే హిట్టు కొట్టే అవ‌కాశాలు ఉన్నాయి.