Pragathi Aunty: డబ్బులు లేక చివరకు అలా చేయాల్సి వచ్చిందన్న నటి ప్రగతి.. ఆమెలోని చీకటి కోణం ఇదే!

Pragathi Aunty: తెలుగులో సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరిని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్లు అయిన హీరో, హీరోయిన్లతో పాటు కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా అందరిని ప్రేక్షకులు బాగా గుర్తిస్తారు. సినిమాలో వాళ్లది చిన్న క్యారెక్టరే అయినా వాళ్ల మీద ఆదరణ చూపిస్తుంటారు. ఇలా ఆదరణ పొందిన ఎంతోమంది నటుల్లో నటి ప్రగతి కూడా ఒకరు.

pragathi-aunty

ఎన్నో తెలుగు సినిమాల్లో తల్లిగా, అక్కగా, వదినగా, అత్తగా, ఆడపడుచుగా ఇలా రకరకాల క్యారెక్టర్లు చేసిన నటి ప్రగతికి.. ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి గుర్తింపును తెచ్చాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ప్రగతి.. తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో సైడ్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టింది.

సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేసినా తనదైన స్టైల్ తో, యాక్టింగ్ తో నటి ప్రగతి తెలుగు ప్రేక్షకుల ప్రేమానురాగాలకు దగ్గరైంది. కేవలం సినిమాలతోనే కాదు, జిమ్ లో వర్కవుట్లు చేస్తూ, అప్పుడప్పుడు కుర్రకారుకు హీట్ పుట్టేలా డ్యాన్సులు చేస్తూ నటి ప్రగతి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

సినిమాల్లో రంగురంగుల తెర మీద కనిపించే నటి ప్రగతి జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. తాజాగా ఈమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ‘ఓపెన్ టాక్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో పాల్గొంది. అందులో తన జీవితంలో జరిగిన పలు ఘటనల మీద నోరువిప్పింది. జీవితం అనుకున్నంత సులభం కాదని, అందరికీ ఒకేలా ఉండదని ప్రగతి చెప్పుకొచ్చింది.

తన భర్తతో తన అనుబంధాన్ని కొనసాగించడానికి చాలా ప్రయత్నించానని కానీ అది కుదరదేని ప్రగతి తన వివాహ బంధం గురించి మనసు విప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో తన భర్త నుండి విడిపోవాల్సి వచ్చిందని, కానీ చాలాసార్లు తనకు కూడా తోడు ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలిగినట్లు వివరించింది.

తన జీవితంలో ఆర్థిక కష్టాలను ఎన్నో ఎదుర్కొన్నానని, తప్పనిసరి పరిస్థితుల్లో తన బంగారు నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని బాధతో వివరించింది. తన పిల్లలను మాత్రం ఎలాంటి లోటు లేకుండా పెంచానని, వాళ్లు ఇప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రగతి వివరించింది.

Similar Articles

Comments

తాజా వార్తల