ఆంధ్రలో హైపర్ లూప్ – భ్రమల్లో పిచ్చి బాబు

593

బొమ్మల పిచ్చి పట్టిన చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా ఉన్న కారణంగా, ప్రపంచంలో చివరకు అమెరికా, ఐరోపా దేశాలలో లేకపోయినా, సాంకేతిక ఆసియా దిగ్గజాలు జపాన్, దక్షిణ కొరియా, చైనా లలో లేకపోయినా హైపర్ లూప్ రవాణా గురించి ఇక్కడ ప్రదర్శన జరుగుతున్నది.

గాలిలో ధ్వని వేగం సెకనుకు 330 మీ . అంటే గంటకు 1188 కిమీ. భూమిపై అంత వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థ లేదు. బుల్లెట్ రైలు వేగం కూడ గంటకు 300 కిమీ. అంటే సెకనుకు 83 మీ. బుల్లెట్ రైలు ఒక విద్యుదయస్కాంత దృగ్విషయం. గాలి ఘర్షణ వల్ల మండిపోకుండా ఉండటానికి భూగర్భంలో వేసిన ప్రత్యేక పట్టాలపై వెళుతుంది. మరియు ఉపరితలం ప్రత్యేకంగా ఫైర్ ప్రూఫ్ తో ఉంటుంది.

ఇక ప్రతిపాదిత హైపర్ లూప్ పాడ్ ధ్వని వేగంతో ప్రయాణించడానికి (గంటకు 1200 కిమీ), గాలి ఘర్షణ వల్ల మండిపోకుండా ఉండటానికి దానిని పూర్తిగా శూన్యపు గొట్టాల గుండా పోయేట్లు డిజైన్ చేసారు. రైలు పెట్టె వంటి దాని బోగీని పాడ్ అన్నారు. ఈ ‘పాడ్’ ఒక శాశ్వత అయస్కాంతం పై పరిగెత్తాలి. బ్రేకులు, చోదక వ్యవస్థ లు డిజైన్ దశలో ఉన్నాయి.

ఆంధ్రలో హైపర్ లూప్ – భ్రమల్లో పిచ్చి బాబు

దేశ జనాభా ఏమన్నా తక్కువగా ఉందా? వందల రైళ్లు, వేల బోగీలు వారి అవసరాలకు సరిపోవడంలేవు. ఇంకా తెస్తున్నారు. దేశం మొత్తంలో మూడో ట్రాక్ వేసి సరుకు రవాణా ను మల్లించడానికి కూడా సరిపడా నిధులు లేవు. మిగతా రాష్ట్రం లో కనీసం బస్సులు కూడా సరీపడినన్ని లేవు. ఇవన్నీ తీర్చలేని రవాణా అవసరాలు, ఒక కాప్సూల్ తీర్చుతుందని చెప్పడం భ్రమలో ఉంచడమే.

ఇప్పుడు ఈ పనికి మాలిన హైపర్ లూప్ ఊహాచిత్రం బొమ్మలు, ఊహాజనిత రవాణా, సిద్ధాంతం నుండి ప్రయోగదశ కు కూడా రాని దాని గురించి ఒక పేద రాష్ట్రం, కనీస సౌకర్యాలు పూర్తికాని రాష్ట్రం మాట్లాడటం అంటే కేవలం పిచ్చి ముదరటం తప్ప మరేమీ కాదు.

ఖర్చు, నిర్వహణ, ఎంత శాతం జనాభా అవసరాలు తీర్చగలదు వంటివి ఆలోచన లేకుండా ప్రపంచంలో మీరే గొప్ప వ్యక్తి అని చెబితే ప్రతీది నమ్ముతున్నందున, ఎక్కడెక్కడ తలకుమాసిన మేధావులు ఆంధ్ర ప్రదేశ్ ను ఓ ప్రయోగశాల చేద్దామని అనుకొంటున్నారు. దానివల్ల విలువైన కాలం, ధనం ఆంధ్ర ప్రదేశ్ నష్టపోతున్నది.

– శ్రీనివాసరావు పొన్నెకంటి