కామసూత్ర: అరబ్ దేశాల సెక్స్ సాహిత్యంలో ఏముంది?

శృంగార సాహిత్యం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మన మనసులో కొన్ని ప్రత్యేక పేర్లు మెదులుతాయి. లోలితా, లేడీ చాటర్లీస్ లవర్.. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే లాంటి కథలు మనకు గుర్తొస్తాయి.

సెక్స్ గురించి అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాన్ని భారత్‌లో రాశారు. అదే వాత్సాయనుడి కామసూత్ర. సంస్కృతంలో రాసిన ఈ గ్రంథం.. మొత్తం ప్రపంచంలోనే అత్యుత్తమ లైంగిక విజ్ఞాన సాహిత్యంగా పేరు సంపాదించింది. సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బార్టన్ ఈ కామసూత్రను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనువాదాలు పాపులర్ అయ్యాయి.

అయితే, ఇప్పుడు మనం కామసూత్ర గురించి చెప్పుకోవడం లేదు.ఈ రోజు మనం అరబ్ దేశ శృంగార సాహిత్యం గురించి చెప్పుకుందాం. శృంగారానికి సంబంధించిన సాహిత్యం, అది కూడా అరబ్ దేశాల్లో అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. కామసూత్రను ఇంగ్లిష్‌లోకి అనువదించిన సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బార్టన్ అరబిక్‌లోని ఒక పుస్తకాన్ని కూడా అనువదించారు. ఆ పుస్తకం పేరు ద పెర్‌ఫ్యూమ్డ్ గార్డెన్. అయితే దీని అనువాద మూలం అరబిక్ కాదు. బార్టన్ దీన్ని ఫ్రెంచ్ భాష నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు.

ఈ పుస్తకాన్ని 15వ శతాబ్దంలో అరబ్ దేశమైన ట్యునీషియాకు చెందిన మహమ్మద్ నఫ్‌జవి రాశారు. ఈ పుస్తకంలో శారీరక బంధాలు ఏర్పరుచుకునే ఎన్నో పద్ధతులను వివరంగా చెప్పారు.కామసూత్ర అనగానే, సాధారణంగా అందరూ ఇది లైంగిక ప్రక్రియలో భంగిమల గురించి వివరించే పుస్తకం అని భావిస్తారు. కానీ, ఈ పుస్తకం మహిళల హక్కుల గురించి నొక్కి చెబుతుంది.

ఈ పుస్తకం ప్రకారం సెక్స్ అనే హక్కు పురుషుడిదే కాదు.. ఇందులో మహిళకు కూడా సమాన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే వారి హక్కులను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతుంది.మరో మాటలో చెప్పాలంటే.. సెక్స్ విషయంలో మహిళల ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేయడం గురించి చెబుతుంది కామసూత్ర. దీనికి భిన్నంగా, ద పెర్‌ఫ్యూమ్డ్ గార్డెన్ పుస్తకంలో… శారీరక బంధాలను ఆస్వాదించడం గురించి చర్చించారు. దాంతోపాటు… సెక్స్ చేసే పద్ధతుల గురించి కథల ద్వారా ఈ పుస్తకంలో వివరించారు. ఈ కథలను అలిఫ్ లైలా రాసిన విధానంలోనే రాశారు. అది పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.

Similar Articles

Comments

తాజా వార్తల