జనసేనాని ‘జగన్’ని మాత్రమే టార్గెట్ చేసాడుగా..

152

జన్సేన అధినేత పవన్రా కళ్యాణ్బో ప్రజల్లోకి వచ్చేసారు. రాబోయే ఎన్నికల్లో తన పంథా ఏమిటో దాదాపు చెప్పేసారు. మిగిలిన పార్టీలతో పాటు ఎక్కువగా వైకాపా అధినేత జగన్ మీదే విమర్శలు గుప్పించారు. ‘చల్ చలోరే చల్’ అంటూ మొదలుపెట్టిన కార్యక్రమంలో విశాఖలో తొలిగా మాట్లాడిన సమావేశంలో చేసిన విమర్శలు నేరుగానే జగన్ కు గురిపెట్టాయ్.

ముఖ్యమంత్రి అయ్యాక ఏదో చేస్తామని చెప్పడం తనకు రాదని, కాబోయే సీఎం అని పిలిచే సరదా అభిమానులకు ఉన్నా, అటువంటి సరదా తనకు మాత్రం లేదన్నారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ చేసే తప్పు మనం చేయకూడదు అంటూ హితవు పలికారు. ఉత్తరాంధ్ర కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నేరుగానే జగన్ పేరు ప్రస్తావించారు. తండ్రి చనిపోగానే సీఎం కావాలని కోరుకోవడం ఏమిటో తనకు అర్ధం కాలేదన్నారు. అది అవివేకం అని, నేతల కొడుకులు సీఎంలు కాకూడదని తాను అనడం లేదన్నారు. అయితే వారసులు అనేవారు నిరూపించుకుని మాత్రమే రావాలని అభిప్రాయ పడ్డారు.

కొన్ని వేల, లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి రాష్ట్ర సీఎం అవడం అంటే అతన్ని చూసి జనం అంతా అలా యధారాజా తథా ప్రజా అన్నట్టు తయారవుతారనే భయంతోనే జగన్ కు వ్యతిరేకంగా, చంద్రబాబుకి మద్దతు ఇచ్చానన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలని లేదు అని అందుకే పాదయాత్ర చేయబోనని… కానీ ప్రజల కోసం ఏ యాత్ర అయినా చేస్తా అన్నారు. ఇలా అవకాశం ఉన్న చోటల్లా పవన్ తనకు జగన్ పట్ల ఉన్న వైఖరిని వెల్లడించారు. వారసుడిగా లోకేష్ సంగతి ఏమిటని అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు తన కొడుకు విషయంలో ఏదో ఎబిలిటీ చూసే ఉంటారని అందుకే మంత్రిని చేసి ఉంటారన్నారు.