ఒక్క వేటుతో రాజకీయ కలల్ని నరికేసుకున్నట్లేనా.!

88

క‌త్తి మ‌హేష్ స్వ‌యంకృతంతో తన చేయి తన మీదే వేసుకున్నాడు. వివాదాలే పెట్టుబ‌డిగా కెరీర్ సాగిస్తున్న కత్తి బిగ్ బాస్ మొదటి సీజన్ ద్వారా కొంత పాపులారిటీ సంపాదించాడు. ఆ త‌రువాత‌, ప‌వ‌న్ కళ్యాణ్ మీద వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మీడియాలో మైలేజ్ తెచ్చుకున్నారు.

అక్క‌డి నుంచీ టీవీ ఛానెళ్ళలో అన్ని రంగాల‌కు సంబంధించి విశ్లేష‌ణ‌లుచేయ‌డం మొద‌లుపెట్టేసాడు. ప‌వన్ ఫ్యాన్స్ తో వివాదంలో ఒక సమయంలో స్థాయిలో క‌త్తిదే పైచేయి అన్న‌ట్టుగా అనిపించింది. అక్క‌డి నుంఛి కత్తి త‌న‌ని తాను అతిగా అంచ‌నా వేసేసుకున్నారు.టీవీ ఛానెల్స్ లో డిబేట్లు, అన్నీ త‌న‌కే తెలుసు అన్న‌ట్టుగా మాట్లాడటం, సోష‌ల్ మీడియాలో రోజూ ఏదో ఒక హ‌డావుడి చేస్తూ వచ్చాడు.

దీనితో క‌త్తి మ‌హేష్ ని ఒక బ‌డా రాజ‌కీయ పార్టీ త‌ర‌ఫున చోటా నాయ‌కుడిగా స్థానం పొందే స్థాయికి వెళ్ళగలిగాడు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో శ్రీ‌రాముడు మీద వివాదాస్పద వ్యాఖ్య‌లు చేయ‌డంతో సీన్ మొత్తం రివ‌ర్స్ అయిపోయింది. ఫ‌లితంగా క‌త్తి రాజ‌కీయ క‌ల‌లు ఒక్క వేటుతో తెగిపోయాయి. క‌త్తి మ‌హేష్ వెన‌క ప్రోత్సాహ‌కంగా నిలుస్తోంద‌నే విమ‌ర్శ‌ల్ని ఎన్న‌డూ ఖండించ‌ని వైకాపా కూడా మ‌హేష్ తో మాకేం సంబంధం లేద‌ని తెగేసి చెప్పేసింది. క‌

వైకాపా ఎమ్మెల్యే శ్రీ‌కాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ క‌త్తి తాజా వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ముదిరి న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వ‌ర‌కూ దారి తీసింది. ఇక‌పై, పెద్ద రాజ‌కీయ పార్టీలేవీ క‌త్తిని ప‌రోక్షంగా కూడా కత్తిని ప్రోత్సహించవు. బీఎస్పీలాంటి చిన్నాచిత‌కా పార్టీలేవైనా చేర‌దీస్తాయేమో త‌ప్ప‌ తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు పట్టించుకోవు. మొత్తానికి కత్తి మహేష్ టీవీ ఛాన‌ల్స్ కూడా క‌త్తిని చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితిని తెచ్చుకున్నాడు.