కిరణ్ కుమార్ రెడ్డి ‘కాంగ్రెస్’లో చేరితే.?

231

ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎవరికి ఎక్కువ లాభం.? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ కనిపించడం లేదు. ఏ వర్గం ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు లేదు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే అలాంటి ఓటు బ్యాంకు ఏర్పడే అవకాశం ఉంది.

కిరణ్ కాంగ్రెస్ లో చేరితే ముందుగా నష్టపోయేది వైకాపానే. వైకాపా స్థాపించినప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం గుంపగుత్తగా ఆ పార్టీకి వెళ్ళింది. కాంగ్రెస్ మరోసారి బలం సంపాదించుకోవాలంటే ఆ ఓటు బ్యాంకును ఆకర్షించుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్‌లోకి వెళ్ళారన్న ప్రచారం జరిగింది. ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసుకుంటే కాంగ్రెస్ బలపడటం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైకాపాతో ఉందని ఆ పార్టీ బలహీనపడితేనే కాంగ్రెస్ బలపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే వైకాపాపై దూకుడుగా వెళ్ళాలని రాహుల్ ఆదేశించడానికి కారణం కిరణ్ సూచనలేనంటున్నారు. కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల రాజకీయంగా కొంత సమీకరణాలు మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలపడటం ప్రారంభిస్తే ఆ పార్టీకి మొదటి నుంచి ఓటు బ్యాంక్ గా ఉన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉంది.

భాజపాతో పోరాటం చేస్తున్నప్పటికీ తెదేపాపై ఉన్న వ్యతిరేకత మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కొంత మంది వైకాపాతో ఉంటున్నారు.  కానీ కిరణ్ కాంగ్రెస్ లో యాక్టివ్ అయితే ఇలాంటి వారందరికీ కాంగ్రెస్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ తన పొలిటికల్ గేమ్ ఆడారు. ఇప్పుడు అవకాశం వస్తే కిరణ్ కమార్ రెడ్డి జగన్ తో అదే గేమ్ ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే తెదేపాకు పండగే.!