‘బీహార్’కు కూడా ప్రత్యేక హోదా కావాలి

309

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. మూడు రోజుల కిందట నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన బీహార్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు.

బీహార్‌కు ప్రత్యేకహోదా డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నా సీఎం దాన్ని రాజకీయంగా తనకు అవసరమైనప్పుడే బయటకు  నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రశంసించిన నితీష్ అదో పెద్ద స్కాం అన్నట్లు మాట్లాడుతున్నారు. సడన్ గా యూ టర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంశాన్ని బయటకు తీసారు. 18 ఏళ్ల క్రితం బీహార్‌ను విభజించి జార్ఖండ్‌ను ఏర్పాటు చేసారు. అప్పటి పునర్ విభజన చట్టంలో ప్రత్యేకహోదా ఉందని బీహార్‌కు దాన్ని ఇంకా ఇవ్వలేదని గుర్తు చేస్తూ నీతి ఆయోగ్ పర్యవేక్షణలో సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి నితీష్ మొదట భాజపా పొత్తులో ఉండేవారు. కానీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన తీవ్రంగా వ్యతిరేకించి పొత్తు వదిలేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో జతకట్టి విజయం సాధించారు. తర్వాత లాలూపై అవినీతి ఆరోపణలు సాకుగా చూపి ఆర్జేడీకి కటిఫ్ చెప్పి భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు నితీష్.

బీహార్ ఎన్నికలపుడు ఆ రాష్ట్రానికి ప్రధాని మోదీ లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అయినా సరే ఎన్నికల్లో ఓడిపోయారు. అన్నీ మాటలే కానీ ఒక్క రూపాయి కూడా బీహార్‌కు మోదీ ఇవ్వలేదని నితీష్ గతంలో ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో నితీష్ రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. ఈ గండం నుండి భాజపా ఎలా బయటపడుతుందో చూడాలి.