కొత్త లుక్ తో ‘జగ్గూభాయ్’కి బాలీవుడ్ స్వాగతం

123

‘లెజెండ్‌’ సినిమాతో జ‌గ‌ప‌తిబాబు సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం మ‌రో మ‌లుపు తిరిగింది. హీరోగా ఎంత సంపాదించాడో, ఎంత పోగొట్టుకున్నాడో తెలీదు గానీ, విల‌న్ పాత్ర‌ల‌తో మాత్రం సెటిలైపోయాడు. తెలుగు, తమిలం, మలయాళం యాలా దక్షిణాది భాషలన్నింటిలోనూ తనలోని విలనిజాన్ని చూపించేసాడు. మాస్ నుండి క్లాస్ విలనిజం వరకూ దాదాపు అన్ని షేడ్స్ చూపించేసాడు.

దక్షిణాదిలో మూడు విలనీ వేషాలు, ఆరు సహాయక పాత్రలతో బిజీగా ఉన్న జగ్గూభాయ్ కి ఇప్పుడు బాలీవుడ్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్న ‘తానాజీ’ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మరాఠా చక్రవర్తి శివాజీ కి సైన్యాధ్య‌క్షుడిగా ప‌నిచేసిన తానాజీ క‌థే ఈ సినిమాకి మూలం. తానాజీ పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ నటిస్తుండగా మారో కీలకపాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు.

సోమ‌వారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ప్ర‌స్తుతం ముంబైలో జ‌గ‌ప‌తిబాబు, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో జ‌గ్గూభాయ్ లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. విల‌న్ పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తిబాబుని ఒకే తరహా లుక్‌లో చూసి విసుగొచ్చిన వారికి ఈ లుక్ కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ఈ సినిమాలోని జ‌గ్గూభాయ్ పాత్ర క్లిక్ అయితే బాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలు రావ‌డం ఖాయం.