మరింత ముదురుతున్న ఎమ్మెల్యేల సస్పెన్షన్ వివాదం

22

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లపై అనర్హతా వేటు వ్యవహారం తెరాస ప్రభుత్వాన్ని గుదిబండగా మారుతోంది. న్యాయపరమైన వ్యవహారాల్లో తప్పులు మీద తప్పులు చేయటంతో ఈ వ్యవహరం కాస్తా అసెంబ్లీ కార్యదర్శుల మెడకు చుట్టుకునే పరిస్థితికి రావడంతో అప్పీల్ దాఖలు చేసింది.

కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి రెండు నెలలు దాటిపోయినా తీర్పును అమలు చేయకపోవడంతో ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసారు. విచారణ కారణంగా కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ శాసనసభ, న్యాయశాఖల న్యాయశాఖ కార్యదర్శులు కోర్టుకు తెలిపి అమలుకు రెండు వారాల గడువు అడిగారు.

గడువు ఇచ్చిన వారంలోపే తీర్పు అమలు కాకుండా సింగిల్‌ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని అప్పీలు దాఖలు చేసారు. పదో తేదీన కోర్టు ధిక్కార కేసు విచారణకు వస్తున్నందున వెంటనే విచారణ చేయాలని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అప్పీల్‌కు 61 రోజుల సమయం తీసుకుని అత్యవసర విచారణ చేపట్టాలనడం ఏమిటని ధర్మాసనం నిరాకరించింది. పదో తేదీన కోర్టు ధిక్కరణపై ఇద్దరు కార్యదర్శులకు శిక్షలు వేస్తే వివాదం మరింత ముదిరే అవకాశముంది.