కేటీఆర్, కేసీఆర్ లపై గెలవాల్సింది ఆంధ్రాలోనా.?

101

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మలక్ పేట నియోజకవర్గంలో తన స్టైల్ టెంపర్ చూపించారు.

గడ్డి అన్నారంలో రోడ్ షో నిర్వహించిన బాలకృష్ణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లపై విమర్శలు చేసారు. ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో వేలు పెడతానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ ‘ఆంధ్రకు వస్తావా..? రా.. దమ్ముంటే చూసుకుందాం’ అంటూ సవాల్‌ విసిరారు. ఆంధ్రా ప్రజలకు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు కూడా వారితో కలిసి ఉద్యమిస్తారంటూ హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు తరిమితే కేసీఆర్, కేటీఆర్ ఆంధ్రకు కాదు ఎక్కడికైనా పారిపోవాల్సిందేనన్నారు. ‘సెక్రటేరియట్‌కు రాలేకపోయానని, మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని రూ.2లక్షల కోట్ల అప్పులు చేసిన మోసగాడినని కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు చెప్పుకుంటారా..? అంటూ డైలాగులు గుప్పించారు.

ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ హైదరాబాద్‌ మీద చంద్రబాబు తనదైన ముద్ర వేసారని స్పష్టం చేసారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ‘చంద్రబాబు బుద్ధిగా ఆయన పని ఆయన చేసుకునేటోడు. అసలు ఏడ్చేటోడు కానేకాదు. పక్కా దిల్లీ, గల్లీలో వేలు పెట్టేవాడు కాదు. విదేశాల్లో గల్లీ గల్లీ తిరిగి పెట్టుబడులు రాబట్టే వాడు’ అంటూ పొగిడేసారు. మరి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లపై బాలకృష్ణ చేసిన విమర్శలపై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.