‘దేవ్’ బ్రతికే దారి వేరు

96

కార్తీ, రకుల్‌ ప్రీత్‌ల తాజా చిత్రం ‘దేవ్’. ఈ చిత్ర టీజర్ దీపావళి కానుకగా సోమవారం విడుదల చేసింది. లవ్‌, యాక్షన్‌, రొమాన్స్‌ కలయికతో ఉన్న టీజర్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి.. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి.. ఇష్టం లేని ఉద్యోగం చేసి.. ముక్కు మొహం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి.. ఈగో, ప్రెషర్.. కాంపిటేషన్లో ఇరుక్కుని.. అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఓ దారి. ఇంకోదారి ఉంది.’  అంటూ కార్తీ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ సాగింది. ‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా’ అంటూ ముగించారు.

రజత్‌ రవిశంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారిస్‌ జయరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో కార్తి రేస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. విజువ‌ల్స్ బాగున్నాయి. తెలుగు, త‌మిళంలో వస్తున్న ఈ చిత్రం కార్తీకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.