సరిహద్దుల్లో కేసీఆర్ ప్రచారం సమస్యలు తెస్తోందా.?

78

తెరాస అధినేత కేసీఆర్ సరిహద్దు జిల్లాలతో ఉన్న తగాదాలను తెరపైకి తెస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైతే మరీ ముఖ్యంగా ఆయన దృష్టి ఉంటుంది.

కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ఆర్డీఎస్ సమస్య ఉంది. దీనిని అడ్డం పెట్టుకుని ప్రచారం ప్రారంభించిన మొదట్లో డీకే అరుణపై కేసీఆర్ విమర్శలు చేసారు. నీరు తరలించుకుపోతూంటే ఆమె హారతులు పట్టారని ఆరోపించారు. దీంతో డీకే అరుణ్ ఫైరవుతూ ఆధారాలు బయటపెట్టాలని అడిగారు. దానిపై తెరాస నేతలు ప్రస్తావన కూడా తీసుకు రాలేదు.

మహబూబ్ నగర్ జిల్లా ప్రచారసభలో కర్నూలు జిల్లా నేతల్ని మాత్రం విమర్శించారు. తూముల్ని పేల్చేస్తానన్న బైరెడ్డిని చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అలంపూర్‌ ఎన్నికల బహిరంగ సభలో ‘ఒరే కొడకా బైరెడ్డీ’ అంటూ ప్రసంగించారు. దీనిపై బైరెడ్డి తీవ్రంగా స్పందిస్తూ తాను కూడా తన యాసలో తిట్టవచ్చు కానీ తానలా మాట్లాడనని హెచ్చరించారు. ఆ మాటలు వెనక్కి తీస్కో లేకుంటే ముక్కుకోసి చేతిలో పెడతా అని హెచ్చరించారు.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఓ వర్గం మద్దతు లభిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్‌ని దుర్మార్గుడు, దోపిడీదారుడిగా తిడుతున్నా ఆ పార్టీ నేతలు తెర వెనుక తెరాసను గెలిపించమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారట.