‘అవిశ్వాసం’ ఓటింగ్ కు దూరంగా ఉంటారట

130

తెలుగుదేశం పార్టీ  కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది. ఈ విభజన హామీల్లో తెలంగాణకు ఇవ్వాల్సినవి ఏమీ ఇవ్వలేదు. అయినా కూడా కేసీఆర్‌ ఎందుకు అవిశ్వాసానికి దూరం అంటున్నారు..?

కొద్దిరోజుల కిందట తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో తమ పోరాటానికి మద్దతివ్వాలంటూ కేసీఆర్‌ను కలుసుకోవాలనుకున్నారు. కానీ కేసీఆర్ సమయం ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యుడు కేకేతో వారు సమావేశమయ్యారు. కేకే కూడా విభజన హామీలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ కూడా నష్టపోతుందని తెదేపాకి అన్ని విధాలుగా మద్దతిస్తామన్నారు. కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని తేలిగ్గా తీసుకోవాలని డిసైడయ్యారు.

అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొంటామని మాత్రం స్పష్టం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో అడ్మిట్ అయిన తర్వాత కేసీఆర్ ఎంపీలతో మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. కేసీఆర్ వ్యూహంపై తెరాస నేతలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోతే ముస్లిం ఓటు బ్యాంక్‌పై ప్రభావం పడుతుందని భయపడుతున్నారు.