నచ్చేవాడు ‘విజయ్, విక్రమ్’లా ఉండాలి

102

నేటి తరం అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఊహించుకుంటారు. అదే విధంగా నేటి తరం యువ కథానాయికలు సైతం మేము కూడా అమ్మాయిలమే, నటన వృత్తి మాత్రమే అనే విషయాన్ని చెపుతున్నారు.

నటి కీర్తీసురేశ్‌ కూడా ఇందుకేమీ అతీతం కాదు. గత మూడు, నాలుగేళ్ళలో ఈ మలయాళ భామ వరుసగా చిత్రాలు చేసేసింది. ‘మహానటి’ సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. తమిళంలో విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించబోతుందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఈ అమ్మడు కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోనున్నానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన ఈ భామని మీడియా పెళ్ళి గురించి ప్రశ్నించింది.

దానిపై సప్మ్దించిన కీర్తి తనకు ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రేమ వివాహం చేసుకుంటారా? లేక పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానం చెపుతూ ‘అది కూడా ఇప్పుడు చెప్పలేను. ఒక వేళ ఎవరినైనా ప్రేమిస్తే అతన్ని పెళ్ళి చేసుకోవడానికి ఇంట్లో అభ్యంతరం చెప్పరని చెప్పింది. ఎలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ‘విజయ్, విక్రమ్‌’ లాంటి వారు భర్తగా రావాలని అనుకుంటున్నట్లుగా చెప్పింది.