‘యన్.టీ.ఆర్’ కోసం సీన్లు పెరుగుతున్నాయట

58

దివంగత మహానటుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ శరవేగంగా తెరకెక్కుతోంది. బాలకృష్ణ స్వీయనిర్మాణంలో క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

వాస్తవానికి భాగాల్లో చెప్ప‌ద‌ల‌చుకున్న విష‌య‌మంతా చెప్పేసే ఆస్కారం దొరుకుతుంది. మొదటి భాగం కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది. ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలో రెండో భాగం ‘మహానాయకుడు’ విడుద‌ల కానుంది. అయితే క్రిష్‌కో కొత్త స‌మ‌స్య వచ్చిప‌డింది. రోజుకో కొత్త ఆలోచ‌న‌, కొత్త సీనూ పుట్టుకొస్తున్న నేపధ్యంలో వాటిని తీస్తున్నాడు క్రిష్‌. ర‌క‌ర‌కాల రూపంలో సీన్లు పెరుగుతూ పోతున్నాయి.

ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌రే అస‌లు స‌మ‌స్య వ‌చ్చిప‌డుతుంది. ఎలాంటి సీన్లు ప‌క్క‌న పెట్టాలో తేల్చుకోవ‌డం అంత సుల‌భం కాదు. పోనీ తీసిన‌వ‌న్నీ ఉంచేద్దామా అంటే నిడివితో స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతుంది. కొన్ని మంచి సీన్లు కూడా ప‌క్క‌న పెట్టి వాటిని త‌రువాత జోడించి విడుద‌ల చేస్తే రిపీటెడ్ ఆడియ‌న్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.