‘యన్.టీ.ఆర్’ వసూళ్ళతో హ్యాపీగా లేరట.!

375

‘గ‌మ్యం’తో తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘యన్.టీ.ఆర్’. దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర మొదటి భాగం ‘కథానాయకుడు’ గత వారం విడుదలయింది.

క్రిష్ తన మొదటి చిత్రం నుండి ప్ర‌తి క‌థ‌లో హ్యుమ‌న్ ఎమోష‌న్స్ పండిస్తూ సోష‌ల్ రెస్పాన్స్‌బిలిటీ ప్ర‌తిఫ‌లించేలా సినిమాల్ని రూపొందిస్తార‌ని పేరుంది. ఆయ‌న సినిమాలు ఫెయిలైన సంద‌ర్భాలున్నా ద‌ర్శ‌కుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ‘కంచె’ చిత్రం జాతీయ‌స్థాయిలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ చిత్రం ద్వారా క్రిష్ త‌న‌లోని మ‌రో సృజ‌నాత్మ‌క కోణాన్ని ఆవిష్క‌రించారు.

అయితే తాజా చిత్రం ‘ఎన్టీఆర్’ క‌థానాయ‌కుడు విష‌యంలో క్రిష్ కాస్త అసంతృప్తిగా ఉన్నార‌ని అంటున్నారు. ఈ బ‌యోపిక్ బ‌క్సాఫీస్ వ‌ద్ద అంతంత మాత్రంగానే వ‌సూళ్ళను సాధిస్తోంది. క్రిష్ గ‌త చిత్రాల‌పై జాతీయ‌స్థాయిలో మీడియా ఆస‌క్తిని చూపించింది. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ బాగుంద‌న్నారే కానీ క్రిష్ ప‌నిత‌నం గురించి ఎవ‌రూ మెచ్చుకోలును ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఎన్టీఆర్ బ‌యోపిక్ నేష‌న‌ల్ లెవ‌ల్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటుంద‌ని క్రిష్ అంచ‌నా వేసార‌ట‌.

ఈ సినిమా గురించి జాతీయ మీడియా ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. ఆరంభంలో మంచి టాక్ సంపాదించుకున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ మాత్రం క్ర‌మంగా క‌లెక్ష‌న్ల‌లో వెన‌క‌బ‌డ‌టంతో క్రిష్ అసంతృప్తితో ఉన్నార‌ట‌.