అనుకూలంగా లేనివారి సంగతి చెప్తారట

100

తెరాస నేత, మాజీ మంత్రి కేటీఆర్ రెండు పత్రికల అధిపతుల సంగతి డిసెంబర్ పదకొండున చెబుతానంటూ హెచ్చరిస్తున్నారు. ఆ రెండు పత్రికలు తెరాసకు అనుకూలంగా రాయకపోవటమే దీనికి కారణమట.

ఆ పత్రికల యజమానులు తెరాసకు ఎదురుగాలి వీస్తోందన్నట్లుగా రాసి చంద్రబాబుతో జట్టుకట్టి కేసీఆర్‌కు, తెరాసకు వ్యతిరేకంగా పని చేసాయని అంటున్నారు. ప్రజా ఫ్రంట్‌కు హవా ఉన్నట్లు అకస్మాత్తుగా న్యూస్‌ పేపర్లు కలర్లు మార్చేసాయంటున్నారు.

వాస్తవానికి కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఎదురు తిరిగేవారు ఉంటారా.? కేసీఆర్‌కు పరిస్థితులు బాగోలేవు కాబట్టి ఆయన ఓడిపోయే అవకాశం ఉందని ఇంత కాలం పెట్టిన నిర్బంధాలు గుర్తుకు వచ్చి మీడియా ఆ విధంగా ప్రవర్తించిందని తెలుసుకోవాలి. మీడియా ఎప్పుడూ ఒక రకంగా ఉండదనే కేటీఆర్ గుర్తించాలి.

మీడియా వ్యతిరేకంగా మారిపోయిందని తెగ బాధపడుతున్నారు. ఎవరైనా ప్రజాభిప్రాయం ప్రకారమే వెళ్తారు. ఆ విషయం కేటీఆర్‌కు అర్థం కాకపోవచ్చు. కానీ లగడపాటి అయినా పత్రికలు అయినా ప్రజల్లో విశ్వసనీయత సంపాదించడానికి కారణం నిజాలు చెప్పడమే. వారు చెప్పేవి అసత్యాలైతే ప్రజలు ఎప్పుడో తిరస్కరించేవారు కదా.