ఎప్పుడు వస్తున్నావు చిరు –వెయిటింగ్ ఇక్కడ

474

మెగాస్టార్ మేనియా గురించి మాటల్లో సులువుగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు. బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మూడు వారాలు దాటుతున్నా పాత రికార్డులకు మూడుతోంది కాని టికెట్ కౌంటర్ దగ్గర బాసు వైభవానికి లోటు లేకుండా అలా అలా సాగిపోతోంది. 100 కోట్లు షేర్ కొట్టే దిశగా దూసుకుపోతున్న చిరు సినిమా పుణ్యమా అని మా టీవీ దశ తిరగబోతోంది . ఖైది నంబర్ 150 సక్సెస్ ఇచ్చిన కిక్ మామూలుగా లేదు. బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ కి పూర్తి న్యాయం చేసిన చిరు ని ఇకపై వరసగా తెరపై చూసుకోవాలి అని కోరుకుంటున్న ఫాన్స్ కోసం ఆయన కూడా వరస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కాని ఖైది నంబర్ 150 షూటింగ్ మధ్యలో ఉండగానే మా టీవీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కి హోస్ట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. అప్పటి నుంచి అదిగో ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన మా టీవీ చివరికి సస్పెన్స్ కి తెర దించనుంది. నిజానికి ఈ ప్రోగ్రాం డిసెంబర్ లోనే మొదలు కావాలి. దానికి కావాల్సిన పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేయటం, ఆడిషన్స్ అన్ని పూర్తి చేసారు. కానీ అసలు ప్రోగ్రాం షూటింగ్ మొదలు పెట్టె టైం కి చిరు ఖైది ఫినిషింగ్ లో బిజీ కావడం రిలీజ్ అయ్యాక కొద్ది రోజులు పూర్తిగా ప్రమోషన్ కి అంకితం కావడం లాంటి కారణాలతో కాస్త లేట్ అయ్యింది.

ఇప్పడు మా టీవీ ఖైది సక్సెస్ ని తనకు అనుకూలంగా బ్రహ్మాండంగా వాడుకోబోతోంది. ఇప్పటికే కొత్త కొత్త టీజర్స్ తో ఫాన్స్ నే కాక రెగ్యులర్ టీవీ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకర్షిస్తున్న మా టీవీ అతి త్వరలోనే చాలా గ్రాండ్ గా లాంచ్ చేయబోతోంది. మొదటి పార్టిసిపెంట్ గా మాజీ హోస్ట్ అక్కినేని నాగార్జున పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందని, రేటింగ్స్ కూడా ఓ కొత్త బ్లాక్ బస్టర్ సినిమా టెలికాస్ట్ చేసినప్పుడు ఎలా వస్తాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా వస్తాయని నమ్మకంగా చెబుతున్నాయి. ఖైది సినిమాలో ఇంటర్వెల్ లో బాగా పేలిన వెయిటింగ్ అనే డైలాగ్ ని ప్రోమోస్ లో వాడుకుంటున్న తీరుని చూస్తుంటే ఇది మొదటి రెండు సీజన్ల కన్నా భారీ ఎత్తున క్లిక్ కావడం ఖాయం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇది మొదలు కావడం పై ఆసక్తిగా ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై తన మేజిక్ ని దశాబ్దాలుగా ప్రూవ్ చేస్తూనే ఉన్న చిరు మొదటి సారి స్మాల్ స్క్రీన్ పై రాబోతున్నారు అంటే ఫాన్స్ మాత్రమే కాదు ఆయనకు వెల్కం చెప్పిన ప్రతి సినీ అభిమాని ఆనందించే క్షణమే.