యన్.టీ.ఆర్ ‘సావిత్రి’ వస్తోంది

101

అలనాటి మహానటి సావిత్రిలా మరొకరిని ఊహించలేం. మ‌హాన‌టి బ‌యోపిక్ తీస్తున్న‌ప్పుడు సావిత్రిగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన‌ప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. వాట‌న్నింటికీ కీర్తి త‌న‌దైన న‌ట‌న‌తో స‌మాధానం చెప్పింది.

ఇప్పుడు ‘యన్.టీ.ఆర్’ బ‌యోపిక్ ద్వారా మ‌రో సావిత్రిగా ‘నిత్య‌మీన‌న్‌’ వ‌స్తోంది. ‘మ‌హాన‌టి’లో సావిత్రి పాత్ర‌కు ముందుగా నిత్య‌నే సంప్ర‌దించారు. కానీ కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల నిత్య ఆ పాత్ర‌ని వ‌దులుకుంది. అయితే ‘యన్.టీ.ఆర్’ బ‌యోపిక్ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం గ‌ట్టిగానే ప‌ట్టుకోగ‌లిగింది. ఇందులో నిత్య క‌నిపించే స‌న్నివేశాలు రెండు, మూడే అయినా అవి క‌థ‌లో చాలా కీల‌క‌మైన ఘ‌ట్టాల్లో వ‌స్తాయి.

నిత్య ఎంత సేపు క‌నిపిస్తుంది? అనేది ప‌క్క‌న పెడితే సావిత్రిగా నిత్య బాగా న‌టించిందా? కీర్తి బాగా చేసిందా? అనే పోలిక సహజంగానే వస్తుంది. రెండు మూడు స‌న్నివేశాలు చూసి న‌టి ప్ర‌తిభ‌ని అంచ‌నా వేయ‌లేం గానీ, ‘నిత్య’ ఒడ్డూ, పొడ‌వూ, శ‌రీర సౌష్ట‌వం విష‌యాల్లో సావిత్రికి అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. మంచి న‌టి కాబ‌ట్టి క‌నిపించేది రెండు స‌న్నివేశాలైనా త‌న‌దైన ముద్ర వేయ‌గ‌ల‌దు.