మెగా అల్లుడు ‘విజేత’ అవుతాడా.?

109

మెగా ఫ్యామిలీ మరో హీరో వస్తున్నాడు. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’గా వస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తో పాస్ మార్కులు వేయించుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో అనే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని ఏ మాత్రం తగ్గించకుండా ‘విజేత‌’ ఈరోజు టీజర్ తీసుకొచ్చాడు. కళ్యాణ్ దేవ్ టీజ‌ర్లో ఇంకొంచెం మార్కులు వేయించుకున్నాడు.

కళ్యాణ్ దేవ్ లుక్ బాగుంది. డ‌బ్బింగ్ ప‌రంగా చూస్తే వాయిస్ బాగుంది. ఇదో తండ్రీ కొడుకుల క‌థ‌ అని టీజర్లో చెప్పేసారు. చిరంజీవి అల్లుడు కదా అన్నట్లు కాకుండా క‌థ‌లో ఏం చెప్ప‌బోతున్నారో అదే చూపించారు. ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని మెచ్చుకోవాల్సిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్ నాయికగా నటిస్తోంది. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ చిత్రం చిరు అల్లుడిని విజేతగా నిలబెడుతుందా.? లేదా చూడాలి.