ఉన్మాదం, రావణకాష్టం, రౌడీయిజం vs పెద్దరికం, హుందాతనం, అనుభవం, దూరదృష్టి…

650

డేరాబాబా వలే జగన్ ఉన్మాది అన్నారు కాకినాడ సభలో చంద్రబాబు. ఇంకా జగన్ కు పెద్దరికం లేదు. హుందాతనం లేదు. నా అనుభవమంత వయస్సు లేదు. ఉన్మాదం తో చెప్పులతో, చీపుర్లతో కొట్టండి. ఉరితీయాలి అంటున్నారు. రౌడీలను తయారు చేస్తున్నారు. మతం, కులం, ప్రాంతాన్ని అడ్డు పెట్టుకొని రావణకాష్టం సృష్టిస్తారు. నేను ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నా. అందుకే ప్రజలు దూరదృష్టితో ఓటు వేయాలి అన్నారు.

పుష్కరాలు పేరుతో జనాన్ని నిలువునా కట్టేసి చంపడం, ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న గ్రామస్తులను లారీతో తొక్కించడం, కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఉన్న పార్టీ నాయకులను కాపాడటం, ఆంధ్రప్రదేశ్ ను విదేశీవలసగా సింగపూర్ కంపెనీలకు అప్పగించడం, ప్రైవేట్ సంస్థలకు వందల ఎకరాల కేటాయింపు చేయడం, ప్రతి పనికీ ఎమ్మెల్యే /మంత్రి కొడుకుల అనుమతి, లేచింది మొదలు రాజధాని బొమ్మల వింత ఆకారాలకు తాళం వేయడం, నోటికొచ్చిన వాగ్ధానాలు చేసి ప్రజలు అడిగితే జైలుకు పంపుతానని బెదిరించడం, ప్రత్యేక హోదా సభకు వెళ్లకుండా విపక్షాల నిర్బంధం, ప్రజలకు ఇష్టం లేకపోయినా ఆక్వాపార్కు ఊర్ల మధ్యలో పెట్టడం, రాజధాని తాత్కాలిక అభివృద్ధి తప్ప మిగిలిన జిల్లాల్లో అభివృద్ధి నత్తనడక, పదేపదే ఒకేపనికి శంకుస్థాపన చేయడం, ఆర్భాటాలుతో ప్రజాధనం వృథా చేయడం, అంచనాలు పెంచేసి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చడం, బియ్యం తప్ప రేషన్ దుకాణాలు ఎందుకూ పనికి రాకుండా చేయడం, పదేళ్ల గత పాలనలో సాగునీటి ప్రాజెక్టు పేరెత్తకపోవడం, డ్వాక్రా మహిళలను ఓటుబ్యాంకు గా మార్చడం, ఉచిత విద్యుత్ లేకపోగా రాత్రిపూట కరెంటు తో అమాయక ప్రజలను బలిగొనడం, గ్రామసభ నిర్వహించకుండా జన్మభూమి కమిటీ సభ్యులును పెత్తందారులను చేయడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు, పదవి ఎరవేసి కొనడం, పావలా తో అయిపోయేపనికి ముప్పావలా ఇవ్వడం, ఇచ్చిన వాగ్దానాల అమలుకు నోరుతెరచి అడిగే వీలు లేకుండా చేయడం, రైతులు గిట్టుబాటు ధరలేక అప్పుల పాలవడం, రుణమాఫీ జరగక వడ్డీ అసలును మించిపోవడం, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అసలు అమలుచేయకపోవడం , రాయలసీమ అవసరాలు ఎన్నికల సమయంలో తప్ప గుర్తు రాకపోవడం, ప్రభుత్వ భూములను ఆక్రమించిన అస్మదీయులను శిక్షించకపోవడం , ………………
ఇవన్నీ చేసినందువల్ల వచ్చిందా చంద్రబాబు? పెద్దరికం, హుందాతనం, అనుభవం, దూరదృష్టి.

  • స్టాంపుల కుంభకోణంలో శిక్ష పడ్డ కరీం తెల్గీ
  • కృషి, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకులు మూసేసిన వెంకటేశ్వరావు
  • మారిషస్ బ్యాంకును మోసంచేసిన సుజనా చౌదరి
  • నోట్లరద్దు సమయాన నల్లధనంతో దొరికిన శేఖరరెడ్డి
  • దేశీయ బ్యాంకులను మోసంచేసిన గంటా
  • యూరో లాటరీ కోల కృష్ణమోహన్
  • సత్యం రామలింగరాజు

వీరందరికీ గురువు ఎవరు?
ఆ గురువును ఏ పేరుతో పిలవాలి?

రెచ్చగొట్టి ముందు ‘మాట’ అనేది మీరే. తీరా ‘ప్రతిమాట’ అన్నతర్వాత నన్ను అలా అంటున్నారు అనేది మీరే. కాబట్టి సంయమనంతో మాట్లాడటం మంచిది. లేదా అంతకు మించిన బిరుదుల వడ్డన కోసం అట్టే ఎదురుచూడవలసిన పనిలేదు. రోజుకోకటి వస్తుంది. సిద్ధంగా ఉండండి.

ఎన్నికల వాగ్ధానాలు నిలబెట్టుకోకుండా, విశ్వసనీయత పోగొట్టుకున్న చంద్రబాబును, ఎప్పుడూ సత్యం చెప్పే వారిని హరిశ్చంద్రుడు అన్నట్లు, ఎప్పుడూ అబద్ధాలు ఆడేవారిని చంద్రబాబు అంటున్నారు ఈమధ్య. ఇంగ్లీషు లో liar-in-chief అనవచ్చునేమో.

– శ్రీనివాసరావు పొన్నెకంటి