Bangarraju Movie Review: బంగార్రాజు మూవీ రివ్యూ

Bangarraju Movie Review: బంగార్రాజు సినిమాకు మంచి టాక్ వినిపిస్తోంది. చాలా రోజుల తరువాత మంచి ఫ్యామిలీ డ్రామా చిత్రం చూసామని ప్రేకులు అంటున్నారు. నాగార్జున, రమ్య కృష్ణ ఈ మూవీలో చాలా యంగ్ గా కనిపించారని, వారిని అలా చూసి ఒక్కసారి షాక్ తిన్నట్లు ఫ్యాన్స్ థియేటర్ల నుంచి బయటికి రాగానే తమ అభిప్రాయాన్ని చెబుతన్నారు.

Bangarraju Movie Review

పూర్తి అక్కినేని ఫ్యామిలీ సినిమాగా చెప్పుకోవచ్చు. నాగార్జున, నాగచైతన్య కాలిసి నటించిడమే కాకుండా వారే ఈ సినిమాను తమ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ కింద నిర్మించారు. నాగచైతన్యకు “లవ్ స్టోరీ” తరువాత మరో హిట్ గా చెప్పుకోవచ్చు. ఫరియా అబ్దుల్లా ఐటంసాంగ్ లో ప్రత్యేకంగా నిలవడం ఈ సినిమాలో మరో హైలైట్.

బంగార్రాజు సినిమాను కళ్యాన్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేశారు. స్టోరీ కూడా ఆయనదే. క్రితి షెట్టి, నాగచైతన్యకు జోడీగా, రమ్యకృష్ణ, నాగార్జునకు జోడీగా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా, జె యువరాజ్ కెమెరాని హ్యాండిల్ చేశారు. మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండేట్టు ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

బంగార్రాజు సినిమా కథ మొదట్లో కామెడీగా స్టార్ట్ అయి, రొమాంటిక్ గా ఆ తరువాత ఎమోషనల్ గా సాగుతుంది. చివరిగా యాక్షన్ సీక్వెన్సస్ అద్భతంగా తెరకెక్కించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. నాగార్జున, రమ్మకృష్ణ ఇద్దరూ మరణానంతరం ఆత్మలుగా వచ్చి తమ కొడుకును పక్కనుంచి ఎలా చూసుకుంటాయి, ఎలా కాపాడుకుంటాయనేదే ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్.

సినిమా ఎలా ఉందంటే

బంగార్రాజు 2022లో వచ్చిన ఓ మంచి బంగారం లాంటి సినిమా. కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కావలసిన అన్ని జానర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఆలస్య చేయకుండా ఈ సినిమాను వెంటనే చూసెయ్యండి.

మూవీ రేటింగ్ : 3.5/5

Similar Articles

Comments

తాజా వార్తల