నాగశౌర్య ‘గే’ ఎలా అయ్యాడు.?

145

‘ఛలో’ లాంటి హిట్‌ తరువాత నాగశౌర్య ‘నర్తనశాల’తో వస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు. టీజర్‌ ఆద్యంతం వినోద భరితంగా ఉంది. నాగశౌర్య నటన, కామెడీ డైలాగ్‌లు అన్నీ ఆకట్టుకుంటున్నాయి. కాష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై శంకర్‌ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

‘న‌ర్త‌న‌శాల‌’ అనే టైటిల్‌లోనే ఓ మ్యాజిక్ ఉంది. టైటిల్ చూస్తే హీరో క్యారెక్ట‌ర్‌ని అంచ‌నా వేసేయొచ్చు. నాగ‌శౌర్య సినిమాకి ‘@ న‌ర్త‌న‌శాల‌’ అనే టైటిల్ పెట్ట‌గానే ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌బోతోందో అర్థ‌మైపోయింది. టీజ‌ర్‌లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఏమిటో చెప్పేసారు. ‘నువ్వు ఉత్త‌రం గాడివా’ అంటూ జేపీ డైలాగ్‌కి నాగ‌శౌర్య ఎక్స్‌ప్రెష‌న్ చూస్తే అర్థ‌మైపోతుంది.

చిన్న‌ప్ప‌టి నుంచీ ఆడ‌గాలి సోక‌కుండా, ఆడ‌పిల్ల‌లా పెరిగిన ఓ కుర్రాడి క‌థ ఇది. విజువ‌ల్స్ రిచ్‌గా ఉన్నాయి. ల‌వ్‌, కామెడీ, రొమాన్స్‌, యాక్ష‌న్ ఇలా అన్నీ స‌మ‌పాళ్ల‌లో మేళ‌వించిన ఫీలింగ్ క‌లుగుతోంది. ‘ఛ‌లో’తో గాడిలో పడిన శౌర్య‌ కెరీర్ ను ‘న‌ర్త‌న‌శాల‌’ ఎటు వైపునడిపిస్తుందో చూడాలి.