డి.ఎస్. హబీబుల్లా గారి చేరికతో మైనారిటీ వార్డులలో జోరుగా సాగుతున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రచారం

311

Nandyal Muslim minority leaders joined in YSRCPడి.ఎస్. హబీబుల్లా గారి చేరికతో మైనారిటీ వార్డులలో జోరుగా సాగుతున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రచారం

రెండుల రోజుల క్రితం నవరత్నాలకు ఆకర్షితులై హైద్రాబాద్ లోటస్పాండ్ లో జన నేత జగన్ సమక్షంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన నంద్యాల పట్టణానికి చెందిన మాజీ ఎస్. డి. పి . ఐ. రాష్ట్ర అధ్యక్షుడు డి.ఎస్. హబీబ్ గారి ఆధ్వర్యములో సుమారు 500 మంది యువకులతో 2 డివిజన్ లో భారీ ఎత్తున వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారంలో కడప శాసన సభ్యులు ఎస్.బి. అంజాద్ బాషా గారు, 2 వార్డు మైనారిటీ నాయకులు సాదిఖ్, డి. ఎస్. హబీబుల్లా, గల్ఫ్ కన్వీనర్ ఇంటింటికి వెళ్లి ప్రచారము నిర్వహించారు ఈ సందర్భముగా అంజాద్ బాషా గారు మాట్లాడుతూ రాష్ట్రం లో ఉన్న ముస్లిం ప్రజలకు మేలు జరిగింది అంటే ఒక దివంగత ముఖ్యమంత్రి మహా నాయకులు వై. యస్. రాజశేఖర్ రెడ్డి ద్వారానే జరిగిందని వారి ఆశయ సాధన కొరకు వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ స్ధాపించిన మా అధినేత వై.యస్.జగన్ గారి ద్వారానే ముస్లిం ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. హబీబుల్లా గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గంలో మూడున్నర సం : అయినా ముస్లింలకు చోటు కల్పించకుండా రాష్ట్ర ముస్లిం ప్రజలకు అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యాక్తం చేశారు. ముస్లిం ప్రజలను అవమాన పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓటు ద్వారా బుద్ధి చెప్పే అవకాశము నంద్యాల ముస్లిం ప్రజలకు వచ్చిందని వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు