రివ్యూ :ఇదొక ‘సిల్లీ’ సినిమా

223

వరుస ఫ్లాపుల్లో ఉన్న అల్లరి నరేష్‌, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సిల్లీ ఫెలోస్‌’. రీమేక్‌ చిత్రాలనే నమ్ముకున్న భీమినేని శ్రీనివాసరావు మరోసారి తమిళ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముగ్గురి కెరీర్ కు కీలకమైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా..? చూద్దాం.

కథేమంటే..

సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం(జయప్రకాష్ రెడ్డి) అనుచరులు వీరబాబు (నరేష్), సూరి బాబు (సునీల్‌). జాకెట్ ఇమేజ్‌ కాపాడటం కోసం వీరబాబు ఎలాంటి మోసం చేయడానికైనా రెడీ అవుతాడు. అలా ఓ కార్యక్రమంలో సూరిబాబు, రికార్డింగ్‌ డ్యాన్సులు చేసే పుష్ప(నందిని)లకి పెళ్ళి చేస్తాడు. అప్పటికే సూరిబాబుకు కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్ళి కుదరటంతో పుష్పను వదిలించుకునేందుకు ఎమ్మెల్యేను ఆశ్రయించాలనుకుంటాడు. అదే సమయంలో తను ప్రేమించిన వాసంతి (చిత్రా శుక్లా)ఉద్యోగం కోసం వీరబాబు జాకెట్‌కు పది లక్షల రూపాయలు ఇస్తాడు. ఈ రెండు సమస్యలు పరిష్కరించాల్సిన జాకెట్‌, మినిస్టర్‌ గోవర్థన్ ను పరామర్శించడానికి హాస్పిటల్‌కు వెళ్ళి తిరిగి వచ్చే దారిలో ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. మినిస్టర్ చనిపోతూ 500 కోట్లకు సంబంధించిన రహాస్యాన్ని జాకెట్‌కు చెప్పటంతో భూతం(పోసాని కృష్ణమురళి) ఆ డబ్బు కోసం జాకెట్ వెంటపడతాడు. గతం మర్చిపోయిన జాకెట్‌ తిరిగి కోలుకున్నాడా? 500 కోట్లకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టాడా? తమ సమస్యల నుంచి వీరబాబు, సూరిబాబులు ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

తమిళంలో విజయం సాధించిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ సినిమాను కొద్దిపాటి మార్పులతో రీమేక్‌ చేసారు. ఇలాంటి సినిమాలు మన దగ్గర చాలా వచ్చి ఉండటంతో మరోసారి రొటీన్‌ కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో మంచి కామెడీ సీన్స్‌ తో ఆకట్టుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో అలరించలేకపోయారు. హీరోలు ఇద్దరూ కామెడీ చేసినట్లు కానీ, చేయించినట్లు కానీ, చేసేందుకు అవకాశం ఉన్నట్లు కానీ అనిపించదు. క్లయిమాక్స్ దగ్గరకు వచ్చేసరికి కామెడీ బాధ్యతను జయప్రకాష్ రెడ్డి, పోసాని, రఘు తదితరుల మీద పడేసి, ఇద్దరు హీరోలను అలా ఉంచేసారు.

అల్లరి నరేష్ చేత స్పూఫ్ లు చేయించకూడదు అని ఒట్టు పెట్టుకున్నట్లే, కామెడీని కూడా తగ్గించేసారు. వాస్తవానికి సినిమా కామెడీ అంతా సునీల్ దే. సునీల్ పాపం, సిన్సియర్ గా పక్కా కమెడియన్ గా ట్రయ్ చేసారు కానీ, అతనిలో మునపటి జోష్, ఫన్ మూమెంట్స్ తక్కువయ్యాయని అనిపిస్తుంది. టోటల్ గా మాంచి కామెడీ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మాత్రం కలుగదు. హీరోయిన్ ట్రాక్ ను బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి, పక్కకు తోసేసారు. నిజానికి ‘పుష్ప ట్రాక్’తో ఎన్నో కామెడీ సీన్లు రాసుకోవచ్చు.

ఎవరెలా..

దర్శకుడు భీమినేని సినిమాలు చేయాలనుకుంటున్నారు కానీ, ఈ జనరేషన్ కు టేస్ట్, ఈ జనరేషన్ కమెడియన్స్ ఎవరు అన్నది గమనించడం లేదు. కమెడియన్ గా సునీల్, హీరోయిజం పక్కన పెట్టి అల్లరి నరేష్ తమ నటన ప్రదర్శించారు. కానీ వైవిధ్యం అంటూ ఏమీ లేదు. అలవాటైపోయిన బాడీ లాంగ్వేజ్ లు, డైలాగ్ డెలివరీలే. హీరోయిన్లు ఇద్దరికి అంత స్కోప్ లేదు. పోసాని మామూలే. జయప్రకాష్ రెడ్డి కాస్త క్లయిమాక్స్ లో ఆకట్టుకుంటాడు.

ఫైనల్ గా..