‘సైరా’.! అంటూ బడ్జెట్ లెక్కలు పెంచేస్తున్నారు

410

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా-నరసింహారెడ్డి అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సైరాకి బాహుబ‌లిని మించిన హైప్‌ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబ‌లి గురించి జ‌నం ఎలా మాట్లాడుకొన్నారో, సైరా గురించి కూడా అలానే మాట్లాడుకోవాలని చిత్ర బృందం హైప్ ని పెంచడం ఎలా అనే ఆలోచ‌న‌లో ప‌డిపోయింది.

ఈ నేపధ్యంలోనే భాగంగానే బ‌డ్జెట్ అంకెల్ని పెంచేస్తోంది. ఈ సినిమా ప్రారంభానికి ముందు సైరా బ‌డ్జెట్ రూ.100 కోట్ల‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర‌వాత రూ.150 కోట్ల‌న్నారు. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లకి పెంచేసారు. అయితే విశేషమేమంటే ఈ అంకె దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి నోటి నుంచే వ‌చ్చింది. సైరా లొకేషన్ వేటలో భాగంగా దర్శకుడు సురేందర్ రెడ్డి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాడు.

అక్కడి మీడియాతో మాట్లాడుతూ సైరా బడ్జెట్ ప్రస్తావన వచ్చింది. బాహుబ‌లి త‌ర‌వాత తెలుగులో అంత స్థాయి బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే చిత్రం ఇది. అలా మాట్లాడుకోవాల‌నే చిత్ర‌బృందం ముందే బడ్జెట్ లెక్క‌ల్ని ప్ర‌క‌టించేసింది. సాధార‌ణంగా సినిమా మొత్తం పూర్త‌యినా బ‌డ్జెట్ గురించి చెప్ప‌డానికి చిత్ర‌బృందం నిరాక‌రిస్తుంటుంది. సైరా ఇంకా సెట్‌పైకి వెళ్ళనే లేదు, అప్పుడే బ‌డ్జెట్ బిల్డ‌ప్పులు మొద‌లైపోయాయి. అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, నయనతార, ఇలా భారీ కాస్టింగ్ వివరాలు చెప్పటం,  రెహ‌మాన్ సంగీతం చేస్తాడా.? చేయడా అనే వార్తలు ..ఇదంతా హైప్ కోస‌మే కదా.! తాజాగా దానికి బ‌డ్జెట్ హంగామా యాడ్ చేసారు.