‘కథానాయకుడు’లో ..ఆకు చాటు పిందె తడిసే

147

కీర్తి శేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత కథను ‘యన్.టీ.ఆర్‌’ పేరుతో నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ పేర్లతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇందులో శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మెరవబోతోంది.

ఎన్టీఆర్– శ్రీ‌దేవిల‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. ఈ కల‌యిక‌లో ఎన్నో సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘వేట‌గాడు’ ప్ర‌త్యేకం. క‌మ‌ర్సియ‌ల్ సినిమాకి అర్థం చెప్పిన సినిమా అది. ఈ చిత్రంలోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటని బాలకృష్ణ-రకుల్‌లపై తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌-శ్రీదేవి కలయికలో వచ్చిన మరికొన్ని హిట్‌ గీతాల్ని మెడ్లే రూపంలో చూపించే అవకాశాలున్నాయి.

కోటి రూపాయ‌ల పాట‌గా ప్ర‌సిద్దికెక్కిన ‘ఆకు చాటు పిందె త‌డిసె’ పాట అప్ప‌ట్లో మాస్ ని ఊపేసింది. ఈ పాట కోసం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక‌మైన సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఈ వారంలోనే షూటింగ్ కూడా పూర్తి చేస్తారు. పాటను బిట్ రూపంలో వాడ‌తారా? లేదంటే పూర్తి పాట‌ని చూపిస్తారా? అనేది తెలియాల్సివుంది. ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ‘కథానాయకుడు’ 2019 జనవరి 9న విడుదల కానుంది.