తెలుగు మీడియాను దులిపేసిన జనసేనాని

88

ప్రజాపోరాటయాత్రలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మీడియాపై ధ్వజమెత్తారు.

మైనింగ్‌ కంపెనీ అక్రమాలపై ధ్వజమెత్తుతూ పవన్ ‘లఫూట్’ అని తిట్టడం, దాని మీద మన తెలుగు ఛానల్స్ లో డిబేట్ పెట్టడం జరిగింది. దీనిపై స్పందిస్తూ పవన్ మీడియాపై ధ్వజమెత్తారు. ‘వేల కోట్లు దోచుకుంటున్న మైనింగ్‌ కంపెనీ యజమానిని లఫూట్‌ అని నేను తిడితే పవన్ ఇలా తిట్టచ్చా, ఒక నాయకుడు ఇలాంటి మాటలతో తిట్టొచ్చా తిట్టొచ్చా అంటూ తెగ డిబేట్ లు పెట్టారు. బాలకృష్ణ, మోదీ తల్లిని తూలనాడితే డిబేట్లు పెట్టరు.

దెందులూరు ఎమ్మెల్యే మాదిగలను కులంపేరుతో దూషిస్తూ మాదిగ కొడకా అని తిడితే అప్పుడు డిబేట్‌ పెట్టరు. వనజాక్షిని చెప్పుతో కొడితే డిబేట్‌ పెట్టరు. అడ్డగోలుగా రిజర్వ్ ఫారెస్టులో బాక్సైట్ దోచే వాడినిి లఫూట్ అని తిడితే దానికి మాత్రం డిబేట్లు పెడతారా? నా వద్ద వేల కోట్లు లేవు. ఛానళ్ళు లేవు. త్రివిక్రమ్ రాసినట్లు ‘చెప్పిన దాంట్లో అవసరమైన దాన్ని వదిలేసి అనవసరమైన దాన్ని పట్టుకొని వేలాడే వాడిని గూట్లే అంటారు రా గూట్లే’ అని. ప్రస్తుతం తెలుగు మీడియా పరిస్థితి ఇలాగే ఉంది.

వాస్తవానికి తెలుగు మీడియాకి బాధ్యత ఉంటే, మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణ ఎంతవరకు నిజం అని డిబేట్ పెట్టి ఉండేది. ఆరోపణ నిజమా? అబద్దమా? అన్నది వేరే విషయం. మన తెలుగు ఛానళ్ళు కనీసం సమస్యపై, ఆరోపణపై డిబేట్ ఫోకస్ చేయకుండా, పవన్ మాట్లాడిన దాని నుండి ఒక పదాన్ని తీసుకొని దాని మీద డిబేట్ లు పెట్టారు.