పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో.?

99

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం ప్రజా పోరాటయాత్రలో తను పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం గురించి వచ్చే ఫిబ్రవరిలో ప్రకటిస్తానని చెప్పారు.

గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి రైతులను ఆదుకోవడానికి అక్కడ పోటీ చేస్తానని ప్రకటించారు. అవసరమైతే పాదయాత్ర చేస్తానన్నారు. ఏడెనిమిది నెలల తర్వాత పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు వెళ్ళి మేధావులతో సమావేశం జరిపారు. ఆ తర్వాత సంవత్సరానికి అనంతపురం వెళ్ళిన ఆయన ఈసారి పోటీ గురించి మాట్లాడారు.

వాస్తవానికి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంలో ఇంకా డైలమాలోనే ఉన్నట్లుగా ఉన్నారు. పోరాటయాత్రకు జనం ఎక్కడ ఎక్కువొస్తే అక్కడ్నుంచి పోటీ చేస్తాననడం పరిపాటిగా మారింది. మొదట్లో ఇచ్చాపురం నుంచి పోరాటయాత్ర ప్రారంభించి అక్కడ్నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత పాయకరావు పేట, పాడేరు, పిఠాపురం నియోజకవర్గాల్లో మాట్లాడుతూ అక్కడి నుంచి పోటీ చేస్తానమో అనే సందేహాన్ని వ్యక్తం చేసారు.

అయితే ఆయన ప్రకటనల్ని గమనిస్తూ వస్తున్న వారు పవన్ కడప జిల్లా పోరాటయాత్రకు వెళ్ళి పులివెందులలో పోటీ చేస్తానని ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ విషయంలో పవన్ గందరగోళానికి గురి కాకుండా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్తే బాగుంటుందని జనసైనికులు కూడా అభిప్రాయపడుతున్నారు.