పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారట.!

45

వైకాపా అధినేత జగన్‌కు తోడుగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా ముఖ్యమంత్రి పదవి జపం చేస్తున్నారు. ముఖ్యమంత్రి లాంటి పదవులు వద్దని ఆరు నెలల కిందటి వరకూ చెబుతూ వచ్చిన ఆయన కర్ణాటక ఎన్నికల తర్వాత ‘సీఎం’ ప్రకటనలు ప్రారంభించారు.

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పవన్ నోటి వెంట ముఖ్యమంత్రి పదవి గురించిన మాట పదే పదే వస్తోంది. ‘ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయండి. ఆ తర్వాత సరిగ్గా పని చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి’ అని ప్రజలకు ఆఫర్ ఇచ్చేసారు. తన వెనుక ఉన్న యువతరమే తనని ముఖ్యమంత్రిని చేస్తారని ప్రకటించుకున్నారు. ఆదివారం జగ్గంపేటలో పోరాటయాత్ర చేసిన పవన్ ముఖ్యమంత్రి కావడానికి మరో మార్గం ఉందని ప్రకటించుకున్నారు. పవన్‌ సీఎం కావాలన్ననినాదమే వచ్చే ఎన్నికల అనంతరం సీఎం పదవిలో కూర్చోపెడుతుందని ప్రకటించారు.

ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రకటనలు చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. కానీ ఇద్దరూ కలసి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరు సీఎం అవుతారన్నది ఎవరికీ తెలియదు. వీరిద్దరికీ కలిసి పోటీ చేయాలని లేకపోయినా పోటీ చేయాల్సి వచ్చిందన్నట్లుగా పరిస్థితి వస్తే ఏం చేస్తారన్నది చూడాలి.