విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – 12 వ భాగం

228

వైఎస్సార్ అధికారంలో ఉన్నన్ని నాళ్ళు జగన్ బెంగళూర్ లో నివసించారు. ఆయనెప్పుడూ హైదరాబాద్ వచ్చినట్లు మనం వినలేదు. ఈ విషయాన్ని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యగారు అనేకసార్లు చెప్పారు. అలాంటి జగన్ వైఎస్సార్ కేబినెట్ ను ఎలా ప్రభావితం చేసాడో, ఎలా దోచుకున్నాడో చంద్రబాబుకు, లక్ష్మీనారాయణకు మాత్రమే తెలిసిన దేవరహస్యం.

అసలు కేబినెట్ మీటింగ్స్ ఎలా జరుగుతాయి? వాటిలోకి అజెండాను ఎవరు, ఎలా తయారు చేస్తారు? ఎలా చర్చిస్తారు? ఎలా ఆమోదం తెలుపుతారు? కేబినెట్ కు వెళ్లేముందు వివిధ శాఖల్లో అందుకు సంబంధించిన కసరత్తు ఎలా జరుగుతుంది? ఎన్ని స్థాయులు దాటుకుని ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదానికి వెళ్తాయి? ఇవన్నీ పరిపాలనా సంబంధమైన విషయాలు. ఒక ఐపీఎస్ అధికారికి ఈ పద్ధతులు తెలుస్తాయని, వాటిమీద అవగాహన ఉంటుందని నేను నమ్మను. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశించినా సరే, ఏ ఒక్క ప్రతిపాదన నేరుగా మంత్రివర్గ పరిశీలనకు వెళ్లదు.

ఉదాహరణకు ఒక వ్యాపారి తాను ఒక పరిశ్రమ పెడతానని, అందుకుగాను కొన్ని వందల ఎకరాలు స్థలం కావాలని అర్జీ పెట్టుకుంటాడు. అది తాసిల్దారు స్థాయి నుంచి, కలెక్టర్, సచివాలయంలోని కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ఆ తరువాత ప్రధాన కార్యదర్శి ఇంతమంది దాన్ని పరిశీలించాలి. ఆ తరువాత వ్యవసాయశాఖ, పర్యావరణ శాఖ, అటవీ శాఖ ఇంతమంది ఆ స్థలం నిబంధనలకు అనుగుణంగా ఉన్నదా లేదా అని పరిశీలించాలి. ఏ ఒక్కరు అనుమతి నిరాకరించినా అనుమతి దొరకదు. ఇంతమందిని దాటుకుని మంత్రివర్గం ముందుకు వెళ్లినప్పటికీ, మంత్రివర్గం దాన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయం చేసే తుది పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించినా, మంత్రివర్గం ఆమోదించవచ్చు. మంత్రివర్గం చేసిన నిర్ణయం చట్టవిరుద్ధం అని ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లవచ్చు. అయినా సరే, మంత్రివర్గం ఆమోదించి అందుకు అనుగుణంగా జీవోను తయారు చెయ్యమని సంబంధిత శాఖా కార్యదర్శిని ఆదేశిస్తుంది. దానిలో ఏమైనా లొసుగులు ఉన్నాయని, సంతకం చేస్తే తానూ ఇరుక్కుని పోతానని సదరు కార్యదర్శి సంతకం చెయ్యడానికి నిరాకరించవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి సదరు అధికారిని బదిలీ చేసి తనకు అనుకూలంగా వ్యవహరించే అధికారిని తెచ్చుకుని సంతకం చేయించుకుంటాడు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ఉన్నా పధ్ధతి ఇలాగే ఉంటుంది. చంద్రబాబు అవినీతి భరించలేక ఎంతమంది అధికారులు పారిపోయారో ఎవరికైనా తెలుసా?

ఇంత సుదీర్ఘ తతంగం నడిచే పరిస్థితుల్లో ఎక్కడో బెంగళూర్ లో ఉన్న జగన్ హైద్రాబాద్ వచ్చి ఏ అధికారిని ఏవిధంగా ప్రభావితం చెయ్యడానికి వీలు అవుతుంది? ఏ అధికారి అయినా జగన్ నన్ను బెదిరించాడు అని సిబిఐ జరిపిన చెత్త విచారణ లో చెప్పడం జరిగిందా? పరిశ్రమలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్సార్. ఒకవేళ వైఎస్సార్ అవినీతి చేస్తే దాన్ని జగన్ కు ఎలా అంటగడతారు? వైఎస్సార్ చేసిన అవినీతి మన్మోహన్, సోనియా ఖాతాల్లోకి వెళ్తుంది తప్ప జగన్ ఖాతాలోకి వెళ్తుందా?

వైఎస్సార్ పాలనా కాలంలో సోనియా ముడుపులు స్వీకరించలేదా? దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, దానికి అయ్యే ఖర్చు వైఎస్సార్ నెత్తిన వేసేవారు అనేది బహిరంగ రహస్యం. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అనుమతులు ఇచ్చినా, భూములు ఇచ్చినా, తప్పకుండా దానివెనుక ముడుపుల భాగోతం ఉంటుంది. రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ ల మీద ముడుపుల కేసులు లేవా? అగస్టా కుంభకోణంలో వేల కోట్లు సోనియాకు ముట్టినట్లు ఆ కంపెనీ మధ్యవర్తులు ప్రకటించారు. దానికి రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో జైల్లో పడేద్దామా? ఒకవేళ వైఎస్సార్ అవినీతి కి పాల్పడి ఉంటె, అందుకు జైల్లో పడేయాల్సింది మన్మోహన్, సోనియా గాంధీలను మాత్రమే. జగన్ కు ఏమిటి సంబంధం?

(సశేషం)

విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 1
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 2
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 3
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 4
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 5
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 6
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 7
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 8
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 9
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 10
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 11

– ఇలపావులూరి మురళీ మోహన రావు