విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – 13వ భాగం

274

జగన్ జైల్లో ఉండగానే పదిహేడు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. పదిహేను స్థానాల్లో వైసిపి విజయఢంకా మోగించింది. సింహం బోనులో ఉండొచ్చు గాక… అది జూలు విదిల్చి గర్జిస్తే రెండుకిలోమీటర్ల దూరం ప్రతిధ్వనిస్తుంది. కాగడాను నేలమీదకు విసిరినా మంట మాత్రం ఆకాశంవైపే ప్రజ్వలిస్తుంది. రాష్ట్రంలో రెండోసారి అధికారం లోకి రావడానికి సోనియా బొమ్మ కారణం కాదని, వైఎస్సార్ సొంత ఇమేజ్ మాత్రమే అని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం సోనియమ్మ అని వాగిన హనుమంతరావు, కేశవరావుల నోళ్లకు సీళ్లు పడ్డాయి.

ప్రజలంతా జగన్ వైపు ఉన్నారని ఎప్పుడైతే తేటతెల్లం అయిందో, జగన్ కేసులకు నీరసం వచ్చేసింది. పదహారు నెలలపాటు జగన్ ను నాలుగు గోడల మధ్య బంధించినా, రామోజీ రావు, రాధాకృష్ణ ఎన్ని కట్టుకథలు అల్లి అల్లం వెల్లుల్లి మసాలా వేసి వంటలు చేసినా, చంద్రబాబు ఎంతగా ప్రోత్సహించినా, ఉన్నతాధికారులను, మాజీ మంత్రులను చెరసాలలో పడేసినా, కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా సహకారాన్ని అందించినా, లక్ష్మీనారాయణ ఒక్క ఆరోపణను కూడా న్యాయస్థానంలో నిరూపించలేకపోయాడు.
అక్కడ ఏమైనా ఉంటె కదా ఎవరైనా ఏదైనా చేసి చూపేది! ఆయనకు ప్రచారపిచ్చి తప్ప గతంలో ఇలాంటి కేసులను పరిశోధించి నిరూపించిన అనుభవం ఎక్కడుంది? లక్ష్మీనారాయణ వంటి అసమర్దుడిని సిబిఐ ఈ కేసులో పరిశోధనకు పంపించినందుకు జగన్ ఆయనకు కృతజ్ఞుడుగా ఉండాలి మరి.

లక్ష్మీనారాయణ నిర్వాకం తో ఖంగు తిన్నది సోనియా. రాబోయే ఎన్నికల్లో జగన్ అవసరం ఉంటుంది అని గ్రహించింది. దాంతో లక్ష్మీనారాయణను మహారాష్ట్రకు బదిలీ చేశారు. కేసులు చప్పబడి పోయాయి.

ఈ కేసులో జగన్ పాత్ర శూన్యం. వ్యాపార లావాదేవీలకు సంబంధిచిన ప్రభుత్వ నిర్ణయాలను కుంభకోణంగా మలచారు. అమాయకులైన అధికారులను జైల్లో పడేసారు. జగన్ మీద వేసిన పదకొండు ఛార్జ్ షీట్స్ లో ఏడో ఎనిమిదో కోర్టు ఇప్పటికే కొట్టేసింది. మరి సాటి అధికారులమీద తప్పుడు కేసులు వేసి నిరూపించలేకపోయిన లక్ష్మీనారాయణకు శిక్ష లేదా?

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నారు? అధికారంలోకి రాగానే జగన్ నుంచి లక్షకోట్లు కక్కిస్తామన్నారు. ఏదీ? బాబుగారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇంతవరకూ ఒక్క రూపాయి కక్కించార? రాష్ట్రంలో వారిదే అధికారం. కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నది. మరి ఎందుకు జగన్ కేసులను ఇంతవరకు నిరూపించలేకపోయారు? సమాధానం ఉన్నదా వారిదగ్గర?

ఇక్కడ తేలేది ఏమిటంటే… కేవలం అధికార వ్యామోహం తో చంద్రబాబు రాష్ట్రాన్ని చీల్చడానికి సిద్ధపడ్డారు. అధికార పిచ్చితో జగన్ మీద తప్పుడు కేసులను పెట్టించారు. అంతకుముందు బీజేపీని, మోడీని బహిరంగంగా నిందించిన ఆయన మళ్ళీ వెళ్లి మోడీ కాళ్ళు పట్టుకున్నారు. తన ఇమేజ్ తో పోలిస్తే పిపీలికం లాంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి బతిమాలుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని కులాలవారీగా చీల్చిపారేసారు. ప్రతికులానికి వరాలు ఇచ్చారు. బోలెడన్ని అమలుసాధ్యం కానీ హామీలు ఇచ్చారు. ఒక్క యువకుడిని ఎదుర్కోవడానికి కరటక దమనకులకంటే నీచంగా వ్యవహరించారు. చివరకు అత్తెసరు ఓట్ల ఆధిక్యతతో గద్దె ఎక్కారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.

political and cast based vengeance on ys jagan part 13విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – 13వ భాగం

సరే.. ప్రస్తుతం జగన్ మీదున్న కేసుల పరిస్థితి ఏమిటి?

ఇవన్నీ వ్యాపారసంబంధమైన కేసులు. ఇవి కోర్టుల్లో రుజువు కావడం అసంభవం.
ఇక్కడ బాధితులు లేరు. బాధితులు లేనపుడు నిందితులు ఎక్కడినుంచి వస్తారు? ఫిర్యాదుదారులు లేరు. జగన్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క వ్యక్తి ఇంతవరకు కోర్టులో సాక్ష్యం చెప్పలేదు. సాక్ష్యాలు లేకుండా కోర్టులు శిక్షించవు. న్యాయదేవతకు కళ్ళు ఉండవు. చెవులు మాత్రమే ఉంటాయి. ఆ చెవుల్లో సాక్ష్యం చెప్పేవారు లేరు. ఈ కేసులు మరో ఇరవై ఏళ్ళు విచారించినా, జగన్ మీద ఆరోపణలు రుజువు కావు. రుజువు చెయ్యడం సాధ్యం కూడా కాదు. కనుక అతి కొద్ది నెలల్లో జగన్ మీదున్న కేసులను కొట్టెయ్యడం మాత్రమే జరుగుతుంది. ఇవన్నీ కంపెనీలకు చెందిన వ్యాపార వ్యవహారాలు. జగన్ జనాన్ని మోసం చెయ్యలేదు. పారిశ్రామికవేత్తలను వంచించలేదు. ప్రభుత్వాన్ని మోసం చెయ్యలేదు.

కనుక ఎప్పటికైనా జగన్ నిర్దోషిగా కోర్టు తో ముద్ర వేయించుకోవడం తధ్యం. అంతవరకు జగన్ నిందితుడే తప్ప నేరగాడు కాదు. మోసగాడు కాదు. దోషి అంతకంటే కాదు. జగన్ ను ఎవరైనా నేరగాడు, దోషి అంటే వారిమీద కోర్టు ధిక్కారం ఆరోపణ కింద కేసు వేస్తె ఏడాది నుంచి రెండేళ్లు జైలు శిక్ష పడటం ఖాయం.

(సమాప్తం)

విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 1
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 2
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 3
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 4
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 5
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 6
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 7
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 8
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 9
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 10
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 11
విష తక్షకుల విద్వేషాగ్నికి చలించని జగన్ – Part 12

– ఇలపావులూరి మురళీ మోహన రావు