పంచ్ రివ్యూ : తమిళ వాసనతో ‘C/O యావరేజ్’

117

యువ హీరో సందీప్ కిషన్, వరుస హిట్ల జోరులో ఉన్న మెహరీన్ నటించిన ‘కేరాఫ్ సూర్య’ సినిమా విడుదలైంది. ఎలా ఉందో చూద్దాం.!

కథేమంటే ..

సూర్య (సందీప్ కిషన్) తన తండ్రి (నాగినీడు)ను ఓ డాక్టర్ తప్పిదం కారణంగా కోల్పోతాడు. తల్లి (తులసి) చెల్లితో కలిసి బతికేస్తుంటాడు. అలాంటి సమయంలో ప్రాణ స్నేహితుడిని, ఎవరో చంపాలని చూస్తుంటారు. సూర్య తన స్నేహితుడిని రక్షించుకోవాలని చూస్తుంటాడు. ఇలాంటి టైమ్ లో సూర్యకు మరో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటనేదితెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే ..

ఈ సినిమాను సినిమాగా చూస్తే పర్లేదు. ఎక్కడా పెద్దగా అవసరం లేని సన్నివేశాలు కనిపించవు. సినిమా ఎత్తుగడ కాస్త హడావుడిగా ఉన్నా, విలన్ విషయాలను ఎస్టాబ్లిష్ చేస్తూనే, హీరో క్యారెక్టర్ ను కూడా ఓ పద్దతి ప్రకారం ఎలివేట్ చేసాడు దర్శకుడు. ద్వితీయార్థంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ మరీ అంత ఆసక్తిగా సాగదు.  సినిమాలో కీలకమైన మెడికల్ సీట్ల వ్యాపారం, అనర్హత గలిగిన డాక్టర్లు లాంటి పాయింట్లను మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సింది. సినిమా లో కీలకమైన పాయింట్ కు, ఆరంభమైన నాగినీడు సీన్ తో సంబంధం ఉంటుంది. తమిళ ఆఫ్ బీట్ సినిమాలు పూర్తిగా లోకల్ నేటివిటీతో ఉంటాయి. తమిళ రౌడీ గ్యాంగ్ మొహాలు మన ప్రేక్షకులు అంతగా చూడలేరు. మొత్తం మీద అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా ఎక్కడో ఏదో అసంతృప్తి. ఇలాంటి సినిమాలు చాలా చూసేయడం వల్ల ప్రేక్షకుడికి అంత థ్రిల్లింగ్ అనిపించదు.

ఎవరెలా ..

సందీప్ కిషన్ మంచి నటుడే, కానీ అతన్ని కొత్త పాత్రలో చూసినట్లు లేదు. మెహరీన్ పాత్రనే చిన్నది అనుకుంటే, ఆమె హావభావాలు రిజిస్టర్ కాలేదు. సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. మాటల్లో మెరుపులు కూడా వినిపించలేదు. సుశీంద్రన్ టేకింగ్ స్టయిల్, తమిళ థ్రిల్లర్లు నచ్చేవారిని ఈ సినిమా కాస్త ఆకట్టుకుంటుంది.

ఫైనల్ గా ..

ఇంపాక్ట్ ఉన్న కథకి మన అనే కలర్ ఇస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది.