రవితేజ, శ్రీను వైట్ల ‘అమర్-అక్బర్-ఆంటోనీ’.?

147

ఇటీవల వచ్చిన జై లవకుశ చిత్రంలో మూడు పాత్ర‌ల్లో వైవిధ్యం చూపించి త‌న అభిమానుల్ని ఆక‌ట్టుకొన్నాడు ఎన్టీఆర్‌. జై.. ల‌వ‌..కుశ‌గా ఎన్టీఆర్ చూపించిన వైవిధ్యం, న‌ట‌నే జై ల‌వ‌కుశ చిత్రాన్ని నిల‌బెట్టింది. ఇప్పుడు ర‌వితేజ కూడా అదే బాట‌లో న‌డ‌వ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. వాస్తవానికి జై లవకుశ మొదట రవితేజ దగ్గరకే వెళ్ళింది. కధ విన్న ర‌వితేజ మూడు పాత్రలు కాకుండా రెండు పాత్రలతో చేద్దామన్నాడట. అక్కడి నుండి కళ్యాణ్ రామ్ వినటం, ఎన్టీఆర్ ఓకే చేయటం .. సినిమా వచ్చేసి ఎన్టీఆర్ కు మరింత తెచ్చిపెట్టేయటం తెలిసిందే.

తాజాగా రవితేజ – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. రవి తేజ తన కెరీర్ ను నీకోసం అంటూ రవితేజతోనే ప్రారంభించాడు. తరువాత ఇద్దరూ వెంకీ, దుబాయ్ శీను తీసారు.  దాదాపు పదేళ్ళ తర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మరో సినిమా రాబోతుంది. ర‌వితేజ–శ్రీ‌నువైట్ల వేవ్ లెంగ్త్స్ బాగా కుదురుతాయి. ఈ సినిమాలో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ని, ముగ్గురూ అన్న‌ద‌మ్ములే అని టాక్‌.

‘జై ల‌వ‌కుశ‌’లో ఎన్టీఆర్ మూడు పాత్ర‌లు చేసాడు. జై, ల‌వ‌, కుశ ముగ్గురూ అన్న‌ద‌మ్ములే. అయితే ఒకరిలో నెగిటీవ్ కోణాలు క‌నిపిస్తాయి. ర‌వితేజ పాత్ర‌లు మూడు పాజిటీవ్ గానే ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. అంటే ముగ్గురు మొనగాళ్ళు, ముగ్గుర్ప్ర‌ కొడుకులు ఈ మాదిరిలో అన్నమాట. రవితేజ ప్రస్తుతం ట‌చ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. శ్రీను వైట్ల బాద్ షా తరువాత సక్సెస్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరూ నమ్ముకున్న మాస్, కామెడీలతో  మరోసారి మ్యాజిక్ చేయగలిగితే బాగుంటుంది. ‘అమర్-అక్బర్-ఆంటోనీ’ అనే పేరు అనుకుంటున్న ఈ ప్రాజెక్టుపై మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.