పుకార్లపై స్పందించకపోవడమే ఉత్తమ స్పందన.!

112

అమెరికాలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. చికాగో కేంద్రంగా కిషన్ మోదుగుముడి దంపతులు నడిపిన ఈ రాకెట్‌లో కొందరు తెలుగు హీరోయిన్లకు భాగస్వామ్యం ఉందని వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో రెజీనా పేరూ ఈ పుకార్లలో వినిపించింది.

దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ తన ప్రమేయం లేకున్నా వదంతులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించారని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో పుకార్లపై స్పందించకపోవడమే ఉత్తమ స్పందన అన్నారు. ‘నాపై వచ్చిన వార్తల్లో నిజం ఉన్నట్లయితే, ఏదో ఒక యాక్షన్ తీసుకునేవారు కదా. అందులో నిజం లేదని నాకు తెలుసు. కేవలం పబ్లిసిటీ కోసం ఎందుకు స్పందించాలని నేను మాట్లాడలేదు. నేను స్పందిస్తే దానిపై మరొకరు స్పందిస్తారు. పరిష్కారం కనిపించదు. అటువంటి అప్పుడు నేనెందుకు స్పందించాలి’.

‘జనాలు తమకు ఏది కావాలో అది మాట్లాడతారు. మీడియా వాళ్ళు కొంచెం చూసుకొని మాట్లాడాలి కదా. విలేకరులు ఏదైనా చెప్తే ప్రజలు నమ్ముతారు. అందుకని విలేకరులు మాట్లాడే సమయంలో నిజాలు తెలుసుకోవాలి. బాధ్యతగా మాట్లాడాలి’ అని మీడియాకి క్లాస్ పీకేసింది. సినిమా పరిశ్రమ ఒక్కటే చెడ్డది కాదు, ప్రతి పరిశ్రమలోనూ సమస్యలున్నాయి. కాకపోతే కథానాయికలు కెమెరా ముందుంటున్నారు కాబట్టి అందరూ టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించింది.