‘# మీటూ’ ..’సమంత’ ధైర్యంగా ముందుకు వచ్చింది

197

అంతర్జాతీయంగా మొదలైన ‘#మీటూ’ ఉద్యమం భారతీయ సినీపరిశ్రమల్లో కూడా మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేధింపుల గురించి చర్చ జరుగుతోంది. పలువురి చీకటి భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.

తమను ఫలానా వ్యక్తి వేధించాడని ఎవరైనా మహిళ మీడియా ముందుకొస్తే పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరూ ఇప్పటివరకూ ‘#మీటూ’ గురించి మీడియా మాట్లాడలేదు. ఈ మౌనానికి సమంత తెర దించుతూ ‘#మీటూ’కి సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపింది.

‘చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మహిళలు ధైర్యాన్ని కూడదీసుకుని తాము ఎదుర్కొన్న ఘటనల గురించి, లైంగిక వేధింపుల గురించి చెప్తున్నారు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. కొంతమంది వ్యక్తులు, కొందరు మహిళలు కూడా మీటూ గురించి మాట్లాడుతున్న మహిళలను నిలదీస్తున్నారు. ఆధారాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇది సిగ్గుచేటు. మాట్లాడుతున్న మహిళలు ప్రపంచం గురించి అంతగా అవగాహన ఉండని చిన్న అమ్మాయిలను కూడా కాపాడుతున్నారు. ‘#మీటూ ఇండియా’కి నేను మద్దతు ఇస్తున్నా’ అని ట్వీట్‌ చేసింది.